ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలో పనిచేస్తున్న మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో మీటర్ రీడర్స్ నిరసన తెలిపారు. లాక్‌డౌన్ కాలానికి మీటర్ రీడర్లకు జీతం చెల్లించాలని, కరోనా బీమా సౌకర్యం కల్పించాలని, సీఐటీయు నగర అధ్యక్షుడు ఆర్కే ఎస్ వి కుమార్ కోరారు.
పీస్ రేట్ విధానం రద్దు చేసి మీటర్ రీడర్లకు నెలవారీ జీతాలు చెల్లించాలని సీఐటీయూ నాయకులు కోరారు. విద్యుత్ సంస్కరణల చట్టం 2020ని రద్దు చేసి, విద్యుత్ రంగ ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
హైర్ బస్ డ్రైవర్ల ఆందోళన