ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎంపీ సత్యవతి

అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో నెలకొన్న రైల్వే సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు అనకాపల్లి ఎంపీ డాక్టర్ బివి సత్యవతి తెలిపారు. డీఆర్​యూసీసీ మెంబర్లుగా ఎంపికైన పలువురికి నియామక పత్రాలు అందజేశారు.

Appointed DRUCC member
రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎంపీ సత్యవతి

By

Published : Dec 27, 2020, 9:46 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఎలమంచిలి, నర్సీపట్నం ప్రాంతాల్లో రైల్వే పరంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు అనకాపల్లి ఎంపీ డాక్టర్ బివి సత్యవతి తెలిపారు. మాడుగులకు చెందిన శ్రీనాథు శ్రీనివాసరావు(దేవరాపల్లి శ్రీను)ను వాల్తేరు డివిజన్ డీఆర్​యూసీసీ మెంబర్​గా, చోడవరానికి చెందిన బొడ్డు శ్రీరామ్ మూర్తిని విజయవాడ రైల్వే డివిజన్ డీఆర్​యుసీసీ మెంబర్​గా నియామక పత్రాన్ని ఎంపీ అందజేశారు. అనకాపల్లి రైల్వే స్టేషన్​ను మోడల్ రైల్వే స్టేషన్​గా తీర్చిదిద్దుతున్నట్లు ఈ సందర్భంగా వివరించారు.

ABOUT THE AUTHOR

...view details