విశాఖలో ఉత్తమ కాలనీల ఎంపికకు ఆనంద ట్రస్ట్, రాష్ట్ర నివాసితుల సంఘాల సమాఖ్య.. సంయుక్తంగా దరఖాస్తులు ఆహ్వానించాయి. పచ్చదనం- పరిశుభ్రత, తడి పొడి చెత్త వేరు చేయడం, కంపోస్టింగ్, కాలనీ పార్క్ నిర్వహణ అంశాలను ఈ పోటీలో పరిగణలోకి తీసుకుంటామని సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఏవీ రమణరావు తెలిపారు. నగరంలోని అన్ని జోన్లలో నిర్వహించనున్న పోటీల్లో ప్లాటినం పురస్కారం కింద రూ.55,000 స్వర్ణ పురస్కారం కింద రూ.40,000, రజత పురస్కారం కింద 30 వేలు, ప్రత్యేక బహుమతి కింద రూ.25000 నగదు బహుమతులు అందజేయనున్నారు. మార్చి 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, కాలనీ పురోగతి అంశాలను సెప్టెంబరు 30వ తేదీలోగా తెలియజేయాలని కోరారు. నవంబర్లో పురస్కారాలు ప్రదానం చేస్తామని చెప్పారు.
విశాఖలో ఉత్తమ కాలనీల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం
ఆనంద ట్రస్ట్, రాష్ట్ర నివాసితుల సంఘాల సమాఖ్య.. విశాఖలో ఉత్తమ కాలనీల ఎంపిక పోటీకి.. దరఖాస్తులు ఆహ్వానించాయి. మార్చి 31 లోగా దరఖాస్తులు పంపాలని కోరాయి.
విశాఖలో ఉత్తమ కాలనీల దరఖాస్తుకు ఆహ్వానం