విశాఖ జిల్లా సింహాచలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీవరాహలక్ష్మీ నరసింహా స్వామి వారి ఆలయంలో నేడు భక్తులకు దర్శనం కలిగింది. లాక్డౌన్ కారణంగా దాదాపు మూడు నెలలుగా స్వామి వారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు నేటికి దర్శన భాగ్యం లభించింది. భక్తుల దర్శనార్థం స్వామివారి ఆలయాన్ని అందంగా అలంకరించారు ఆలయ అధికారులు.
భక్తులకు అధికారులు కొన్ని సూచనలు చేశారు. స్వామివారి దర్శనాన్ని 4 స్లాట్లుగా నిర్ణయించామని, దర్శనం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకే ఉంటుందని స్పష్టం చేశారు. దర్శనానికి వచ్చే భక్తులు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుని రావాలని తెలిపారు. టికెట్ బుక్ చేసుకోలేని వారు శ్రీదేవీ కాంప్లెక్స్‌లో టికెట్ తీసుకుని దర్శనానికి రావలసిందిగా సూచించారు.