ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పన్నకు ఘనంగా సహస్ర ఘటాభిషేకం - అప్పన్న చందనోత్సం

సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో భాగంగా సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. కరోనా కారణంగా భక్తులకు మాత్రం అనుమతి ఇవ్వలేదు.

appanna sahasra ghatabishekam
అప్పన్నకు ఘనంగా సహస్ర ఘటాభిషేకం

By

Published : Apr 27, 2020, 5:17 PM IST

విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో భాగంగా స్వామివారికి సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. కలశాలతో పవిత్ర జలాలను తీసుకువచ్చి రుత్వికులు స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి తొలివిడత చందన సమర్పణ చేసి ఉత్సవాన్ని ముగించారు.

కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో భక్తులను వేడుకకు అనుమతించలేదు. ఉత్సవాన్ని 15 మంది అర్చకులు మాత్రమే నిర్వహించారు. ఆలయ ఈవో వెంకటేశ్వరరావు, ధర్మకర్త సంచైత గజపతి రాజు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details