విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న ఆలయంలో నేటి నుంచి ఏడు రోజుల పాటు స్వామి వారి కల్యాణోత్సవాలు జరగనున్నాయి. కొవిడ్ దృష్ట్యా భక్తులను అనుమతించకుండా..ఏకాంతంగా కార్యక్రమం నిర్వహించనున్నారు. వైదిక పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం అన్ని పూజలు నిర్వహించి.. స్వామి వారికి కల్యాణం జరిపిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. ఇందుకోసం చేసిన ఏర్పాట్లలో భాగంగా ఆలయాన్ని విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. గాలిగోపురానికి చేసిన అలంకరణ ఆకట్టుకుంటోంది.
నేడు సింహాద్రి అప్పన్నకు ఏకాంతంగా కల్యాణోత్సవం - simhadri apanna temple latest news
విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న సన్నిధిలో జరగబోయే వార్షిక కల్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కొవిడ్ వ్యాప్తి కారణంగా స్వామివారికి ఏకాంతంగా వేడుక నిర్వహించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.
![నేడు సింహాద్రి అప్పన్నకు ఏకాంతంగా కల్యాణోత్సవం simhadri apanna temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11505851-1107-11505851-1619153370424.jpg)
విద్యుద్దీపాల వెలుగులో సింహాద్రి అప్పన్న ఆలయం