ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​.. నిరాడంబరంగా నృసింహస్వామి కల్యాణం - latest news on simhachalam appanna kalyanam

లాక్​డౌన్​ ప్రభావంతో విశాఖ జిల్లా సింహాచలం వరాహ లక్ష్మీ నృసింహస్వామి వార్షిక కల్యాణమహోత్సవం నిరాడంబరంగా జరిగింది.

appanna kalyana news
కరోనా ఎఫెక్ట్​.. నిరాడంబరంగా నృసింహస్వామి కల్యాణం

By

Published : Apr 5, 2020, 5:38 AM IST

ఉత్తరాంధ్రప్రజల ఆరాధ్యదైవం వరాహ లక్ష్మీ నృసింహస్వామి వార్షిక కల్యాణమహోత్సవం... లాక్‌డౌన్‌తో నిరాడంబరంగా జరిగింది. సింహాచలం దేవస్థానంలో... వైదిక వర్గాల నడుమ భక్తుల సందడి లేకుండానే వేడుక సాగింది.

తెల్లవారుజామున సుప్రభాత సేవతో మేల్కొల్పి... పవిత్ర గంగాధర జలాలతో అభిషేకించి నిత్యారాధనలు నిర్వహించారు. సాయంత్రం కొట్నాల ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా జరిపించిన తరువాత... అయ్యవారిని, అమ్మవార్లను వేర్వేరు పల్లకిలో ఉంచి ఆలయ బేడా మండపంలో తిరువీధి నిర్వహించారు. గరుడాళ్వార్ చిత్రపటాన్ని వేదమంత్రోచ్చరణల నడుమ ధ్వజారోహణం నిర్వహించారు. మాంగల్యధారణ అనంతరం... తలంబ్రాలబోత కార్యక్రమంతో వివాహ వేడుక ముగిసింది.

కరోనా ఎఫెక్ట్​.. నిరాడంబరంగా నృసింహస్వామి కల్యాణం

ఇదీ చదవండి: కరోనా వైరస్​తో హృద్రోగులకు అధిక ముప్పు!

ABOUT THE AUTHOR

...view details