విశాఖ సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైశాఖ పౌర్ణమి ఉత్సవం వైభవంగా జరిగింది. స్వామి వారికి ఘనంగా రెండో విడత చందన సమర్పణ చేశారు. ప్రతి ఏటా వైశాఖ పౌర్ణమి నాడు దేశ నలుమూలల నుంచి మత్స్యకారులు వచ్చి...స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఆ సందర్భంగా భక్తులు స్వామి దర్శనానికి పోటెత్తారు. ప్రధానంగా స్వామివారి పుష్కరిణిలో స్నానం చేసేందుకు భక్తులు పోటీపడ్డారు. స్వామి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పట్టింది. మత్స్యకారులు అక్కడే వంట చేసుకుని స్వామికి నైవేద్యాన్ని సమర్పించి.. అనంతరం మెట్ల మార్గంపై నడుచుకుంటూ దేవుడ్ని కీర్తించుకుంటూ స్వామి దర్శన చేసుకున్నారు. దేవస్థాన అధికారులు భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. అప్పన్న స్వామికి మూడు మణుగుల చందనం సమర్పించిన నేపథ్యంలో... రెండో విడత చందన సమర్పణ పూర్తయింది.
సింహాచలంలో వైభవంగా వైశాఖ పౌర్ణమి ఉత్సవం
ప్రతి ఏటా నిర్వహించే వైశాఖ పౌర్ణమి ఉత్సవం విశాఖ సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా జరిగింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన మత్స్యకారులు స్వామి దర్శనం చేసుకున్నారు.
వైభవంగా వైశాఖ పౌర్ణమి