రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు తాము మద్దతు ప్రకటిస్తున్నట్లు ఏపీఎన్జీవో సంఘం విశాఖలో ప్రకటించింది. అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం.. పరిపాలన వికేంద్రీకరణకు ఎంతో దోహదపడుతుందని ఎన్జీవో సంఘం ప్రతినిధి ఎం.ఆనంద్ బాబు తెలిపారు. విశాఖలో సెక్రటేరియట్ నిర్మించడం ద్వారా దశాబ్దాలుగా వెనుకబడి ఉన్న ఉత్తరాంధ్రలాంటి ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నమని తెలిపారు. ఈ నెల 21న ముఖ్యమంత్రి పుట్టిన రోజును ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
మూడు రాజధానుల ఏర్పాటుకు ఏపీఎన్జీవోల మద్ధతు - మూడు రాజధానుల ఏర్పాటుకు..ఏపీఎన్న్జీఓ సంఘం మద్ధతు
రాజధాని విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు ఏపీఎన్జీవో సంఘం ప్రకటించింది. విశాఖలో సమావేశమైన సంఘం నేతలు.. మూడు రాజధానుల పరిపాలన వికేంద్రీకరణ జరిగి అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందని అన్నారు.
మూడు రాజధానుల ఏర్పాటుకు..ఏపీఎన్న్జీఓ సంఘం మద్ధతు