ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దీపావళి సందర్భంగా.. ఆప్కో ఆఫర్లు - ఆప్కో సంస్థ న్యూస్

దీపావళి సందర్భంగా ఎంపిక చేసిన వస్త్రాలపై... ఆఫర్లు ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్థ ఆప్కో ప్రకటించింది. ఆప్కో ఉత్పత్తులను ప్రోత్సహించాలని అధికారులు సూచించారు.

apco discount sale on occasion of diwali
ఆప్కో ఆఫర్లు

By

Published : Sep 19, 2020, 5:15 PM IST

దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఆప్కో పలురకాల వస్త్రాలపై తగ్గింపు ధరను ప్రకటించింది. ఎంపిక చేసిన వస్త్రాలపై పలు ఆఫర్లను అందిస్తున్నట్టు ఆప్కో విశాఖ డివిజనల్ మార్కెటింగ్ అధికారి టి. జగదీశ్వరరావు, బ్రాంచి మేనేజర్ బి. విశ్వేశ్వరరావు ప్రకటించారు.

అన్ని రకాల ఆప్కో వస్త్రాలపై 30 శాతం ప్రత్యేక తగ్గింపు సౌకర్యాన్ని దీపావళి సందర్భంగా అందిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని అన్ని రకాల చేనేత ఉత్పత్తులు విక్రయిస్తున్నట్టు తెలిపారు. దీపావళి సందర్భంగా తెలుగు ప్రజానీకం రాష్ట్ర ప్రభుత్వ చేనేత సంస్థ ఆప్కో ఉత్పత్తులను ప్రోత్సహించాలని వారు సూచించారు.

ఇదీ చదవండి:వైకాపాలోకి విశాఖ తెదేపా ఎమ్మెల్యే?

ABOUT THE AUTHOR

...view details