ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

APCC President Shailajanath : బాక్సైట్ తవ్వకాలకే నాలుగులైన్ల రోడ్లు: శైలజానాథ్

భవిష్యత్ లో బాక్సైట్ తవ్వుకుపోయేందుకే విశాఖ మన్యంలో నాలుగులైన్ల రహదారులు వేస్తున్నారని.. ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ శైలజానాథ్ విమర్శించారు. మన్యంలోని పలు గ్రామాలకు కనీసం అంబులెన్సులు వెళ్లేందుకు చిన్నచిన్న రహదారులు నిర్మించలేని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు (APCC President Shailajanath) భవిష్యత్తులో.. మన్యంలో లభించే విలువైన బాక్సైట్ను తవ్వుకుపోయేందుకే సువిశాలమైన నాలుగులైన్ల రహదారులను నిర్మిస్తున్నాయని మండిపడ్డారు.

APCC President Shailajanath fires on state and union govt's
భవిష్యత్తులో బాక్సైట్ తవ్వుకుపోయేందుకే మన్యంలో నాలుగులైన్ల రహదారులు: శైలజానాథ్

By

Published : Nov 29, 2021, 11:01 PM IST


విశాఖ‌ మన్యంలో గర్భిణులు.. ప్రసవం కోసం ఆసుపత్రులకు రావాలంటే డోలీ మోతలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. కొండలు, వాగులు దాటి అనేక అవస్థలు పడుతున్న దీన స్థితి నెలకొంది. ఆయా గ్రామాలకు కనీసం అంబులెన్సులు వెళ్లేందుకు చిన్నచిన్న రహదారులు నిర్మించలేని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భవిష్యత్తులో.. మన్యంలో లభించే విలువైన బాక్సైట్ తవ్వుకుపోయేందుకే (APCC President Shailajanath fires on state and union govt's) సువిశాలమైన నాలుగులైన్ల రహదారులను నిర్మిస్తున్నాయని.. ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ శైలజానాథ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చింతపల్లిలో చేపట్టిన జనజాగరణ అభియాన్ మహాసభలో ఆయన పాల్గొన్నారు.

మన్యంలో పరిస్థితులు చూస్తుంటే.. రానురానూ దుర్భరంగా మారుతున్నాయని శైలజానాథ్ అన్నారు. గిరిజనులకు కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయని మండిపడ్డారు. మన్యంలో నిక్షిప్తమై ఉన్న విలువైన ఖనిజ సంపద(bauxite mining)ను దోచుకునే ప్రయత్నాలు.. చాపకింద నీరులా జరుగుతున్నాయని ఆయన ఎద్దేశా చేశారు. దాని కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో.. జాతీయ రహదారుల నిర్మాణాలు జరుగుతున్నాయని విమర్శలు గుప్పించారు. విశాఖపట్నం నుంచి భవిష్యత్ లో నిర్మించబోయే కర్మాగారాలకు ప్రత్యేక రైల్వే లైన్లు వేసేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయని అన్నారు. ఇందులో భాగంగానే సువిశాలమైన రహదారులు నిర్మిస్తున్నారన్నారు.

గిరిజనుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రజాప్రతినిధులు..వారికి జరుగుతున్న నష్టాలపై కనీసం నోరుమెదపడం లేదని మండిపడ్డారు. ప్రజలు నివాసం ఉంటున్న భూములు, ఇళ్లకు.. శాశ్వత హక్కు పేరుతో రూ.10వేలు బలవంతంగా వసూలు చేయడం దారుణమన్నారు. అడవులనే నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఆదివాసీలకు.. అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమని, కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

AP BJP Core Committee: రాష్ట్ర భాజపా కోర్‌ కమిటీ ప్రకటన.. సభ్యులు వీరే

ABOUT THE AUTHOR

...view details