రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. రుతుపవనాలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. 90 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నట్లు తెలిపింది. బలమైన ఈదురు గాలులు తీరం అంతటా వీస్తాయని.. వీటి తీవ్రత గంటకు 45 కిలోమీటర్ల నుంచి 55 కిలోమీటర్లు వీచే అవకాశం ఉందని వివరించింది.
రాష్ట్రంలో పలు చోట్ల అతి భారీ వర్షాలకు అవకాశం!
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. పలుప్రాంతాల్లో 90 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీచేసింది.
రాష్ట్రంపై ఈదురు గాలుల ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్ల వద్దని హెచ్చరించింది. ఇప్పటికే గత 24 గంటల్లో ప్రకాశం జిల్లా, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యాయని తెలిపింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య ఈ అల్పపీడనం కేంద్రీకృతమై భారీ నుంచి అతి భారీ వర్షాలకు కారణమవుతోందని సిడబ్ల్యూసి తెలిపింది. ఏడు నుంచి 12 సెంటీమీటర్ల వరకు వర్షం కురిస్తే దానిని భారీ అని, 12 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదైతే దానిని అతి భారీగా గుర్తిస్తామని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:అల్పపీడన ప్రభావం.. రాష్ట్రవ్యాప్తంగా వర్షం