ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్లాక్ మార్కెట్​లో.. రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు! - ap latest news

ఒకవైపు కరోనా ప్రాణాలను తోడేస్తుంటే.. మరోవైపు రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల పేరిట బాధితులను.. బ్లాక్ మార్కెట్ గాళ్లు మరింత ఇబ్బందిపెడుతున్నారు. ఒక్కో ఇంజెక్షన్ ను రూ.27 వేలకు అమ్ముతూ సొమ్ము చేసుకొంటున్నారు. విశాఖ అనకాపల్లిలో 5 రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెటింగ్ చేస్తుండగా.. అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

illegal
illegal

By

Published : May 20, 2021, 8:38 AM IST

విశాఖ నగరంలో రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ల అక్రమ అమ్మకంపై విజిలెన్స్ అధికారులు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈమేరకు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అదనపు ఎస్పీజీ స్వరూపరాణి వివరాలు వెల్లడించారు. అనకాపల్లికి చెందిన మల్లా అశోక్, భీసెట్టి దుర్గా ప్రసాద్ సోషల్ మీడియా ద్వారా రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ల అమ్మకం గురించి పలువురికి సందేశం పంపించారు.

విషయం తెలుసుకున్న డ్రగ్ కంట్రోల్ ఇన్​స్పెక్టర్ సునీత... వారిని ఫోన్ ద్వారా సంప్రదించారు. వాల్తేరు వద్ద అమర్‌నాథ్ అనే వ్యక్తిని సంప్రదించాలని భీసెట్టి దుర్గా ప్రసాద్ ఫోన్లో సూచించాడు. అమర్‌నాథ్ ను సంప్రదించగా 5 రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు ఇవ్వడానికి వచ్చాడు. అతని హెటిరో బ్రాండ్ కు చెందిన 5 రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను వెంట తీసుకొచ్చాడు. అధికారులు అతన్ని వెంటనే పట్టుకున్నారు. విచారణలో వాటిని తన కాలేజీ సహచరుడు హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస రెడ్డి నుండి సేకరించానని అమర్ నాథ్ చెప్పాడు.

సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి.. ఇంజెక్షన్‌ ఒక్కొక్కటి రూ .27,000కు విక్రయిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రెమ్‌డెసివిర్ 5 ఇంజెక్షన్ స్వాధీనం చేసుకుని.. డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టం 18 (సి) కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 23,160 కరోనా కేసులు, 106 మరణాలు

ABOUT THE AUTHOR

...view details