ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెద్దబొడ్డేపల్లిలో 100 పడకలతో కోవిడ్ సెంటర్

రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి. బాధితులు ఆస్పత్రుల్లో పడకల కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో విశాఖ జిల్లా నర్సీపట్నంలోని పెద్దబొడ్డేపల్లిలో కరోనా రోగుల కోసం కొవిడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. మరో రెండు రోజుల్లో ఈ కేంద్రం రోగులకు అందుబాటులో రానుందని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తెలిపారు.

mla
mla

By

Published : May 8, 2021, 7:26 AM IST

విశాఖ జిల్లా నర్సీపట్నంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద బొడ్డేపల్లిలోని ఆశ్రమ పాఠశాలలో కొవిడ్ కేంద్రాన్ని 100 పడకలతో ఏర్పాటు చేయనున్నారు. స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, పలువురు అధికారులు ఈ కేంద్రాన్ని పరిశీలించారు.

మరో రెండు రోజుల్లో ఈ కేంద్రం అందుబాటులోకి రానుందని ఎమ్మెల్యే తెలిపారు. కరోనా రోగులకు మెరుగైన వైద్యంతో పాటు.. భోజనం అందిస్తామని అన్నారు. ఈ కేంద్రంలో 10 మంది వైద్యులతో పాటు 20 మంది ఇతర వైద్య సిబ్బందిని నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ కమిషనర్ కనకారావు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details