విశాఖ జిల్లా రావికమతం మండలం కొత్తకోట పోలీసులు 55 కిలోల గంజాయిని పట్టుకున్నారు. నలుగురిని అరెస్టు చేశారు. కొత్తకోట ఎస్సై నాగ కార్తీక్ తెలిపిన వివరాల ప్రకారం.. భీమునిపట్నం - నర్సీపట్నం రోడ్డులో ప్లాస్టిక్ సంచులలో నింపిన 55 కిలోల గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు తనిఖీలు నిర్వహించారు.
కేరళ రిజిస్ట్రేషన్ నెంబర్‌తో ప్రయాణిస్తున్న కారులో గంజాయిని గుర్తించారు. కారును సీజ్ చేసి.. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రూ. 3 వేల నగదు, ఐదు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని కేరళ రాష్ట్రానికి చెందిన నవాజ్, అబ్దుల్, మునీర్, మహమ్మద్ నిషాద్ లుగా గుర్తించారు.