విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్లోని పలు గ్రామాల్లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతుండడంతో.. ఆ ప్రభావం ఉపాధి హామీ పనులపై పడుతోంది. పనులకు వచ్చేందుకు కూలీలు వెనుకంజ వేస్తున్నారు. నర్సీపట్నం మండలంలోని కేఎల్ పురం, ఓఎల్ పురం, చెట్టుపల్లి , ధర్మసాగరం , వేములపూడి, అమలాపురం మిట్టపాలెం , పంచాయతీల్లో ఉపాధి పనులు నిలిచిపోయాయి.
మండలంలోని 12 పంచాయతీల్లో 7520 జాబ్‌కార్డులు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు 5,600 మంది పనులకు వచ్చేవారు. అయితే ఈనెల 4వ తేదీ నుంచి ఐదు పంచాయతీల్లో 2729 మంది మాత్రమే పనులకు హాజరవుతున్నారని ఉపాధిహామీ అధికారులు వెల్లడించారు. కరోనా సోకకుండా నిబంధనలు పాటిస్తూ పనులు కొనసాగించేలా చూస్తున్నప్పటికీ.. కూలీలు హాజరుకావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు.