విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో ఫొని తుపాన్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తెల్లవారుజాము నుంచి ఈదురు గాలులు ప్రారంభమయ్యాయి అమిత వేగంతో బలమైన గాలులు వీయడంతో చెట్లన్నీ ఊగిపోతున్నాయి దట్టంగా మబ్బులు కమ్ముకున్నాయి. గాలి తీవ్రతకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సముద్రతీర ప్రాంతాల్లో అలలు ఎగిసిపడుతున్నాయి. మత్స్యకార గ్రామాల ప్రజలు భయంతో జీవిస్తున్నారు. నియోజకవర్గంలోని రాంబిల్లి, అచ్యుతాపురం మండలాల్లో పునరావాస కేంద్రాల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు.
ఎలమంచిలిలో ఫొని ప్రభావం... ఈదురుగాలులతో స్తంభించిన విద్యుత్ - ap-vsp-tufanyellamanchilli
ఎలమంచిలి ఫొని తుపాన్ ప్రభావంతో తెల్లవారుజాము నుంచే ఈదురుగాలులతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

ఎలమంచిలిలో ఫొని ప్రభావం... ఈదురుగాలులతో స్తంభించిన విద్యుత్
TAGGED:
ap-vsp-tufanyellamanchilli