విశాఖ జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ ఎదుట ఆరుగురు మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఇద్దరు సీపీఐ మావోయిస్టు పెదబయలు ఏరియా కమిటీ దళ సభ్యులు సహా నలుగురు హార్డ్ కోర్ మిలీషియా సభ్యులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు. గొల్లూరి బిరుసు, గొల్లూరి రామయ్య, కొర్రా సత్తిబాబు, గొల్లూరి సత్యనారాయణ, కొర్రా గణపతి, కొర్రా పాత్రో లొంగిపోయిన వారిలో ఉన్నారు. వీరంతా వివిధ హత్యలతోపాటు నేరాల్లో పాల్గొన్నారు. గిరిజనులను బలవంతంగా హత్యలు చేస్తుండడం, సీనియర్ దళ సభ్యుల తీరు నచ్చక, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రజల్లోకి రావాలని వీరంతా ఈ నిర్ణయం తీసుకున్నారని ఎస్పీ వెల్లడించారు.
విశాఖ ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు - అట్టాడ బాబూజీ, విశాఖ జిల్లా ఎస్పీ
గొల్లూరి బిరుసు, గొల్లూరి రామయ్య, కొర్రా సత్తిబాబు, గొల్లూరి సత్యనారాయణ, కొర్రా గణపతి, కొర్రా పాత్రో అనే ఆరుగురు మావోయిస్టులు విశాఖ ఎస్పీ అట్టాడ బాబూజీ ఎదుట లొంగిపోయారు.
లొంగిపోయిన మావోయిస్టులు