ప్రకృతి ప్రేమికుల స్వర్గధామం అయిన డుడుమ జలపాతానికి మంచి రోజులు రానున్నాయి. ఆంధ్ర ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో ఉన్న డుడుమ జలపాతం అభివృద్ధికి ఒడిశా పర్యాటక శాఖ దాదాపు 2 కోట్ల వ్యవయంతో ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 550 అడుగుల ఎత్తు నుంచి ఏడాది పొడువునా నీటి ప్రవాహంతో పర్యాటకులను అలరిస్తున్న డుడుమ జలపాతం ప్రపంచవ్యాప్తంగా సుపరిచితం. జలపాతం వద్ద రెస్టారెంట్లు, టాయిలెట్స్, వ్యూపాయింట్, బారికేడింగ్, మెట్లమార్గం తదితర పనులు చేపట్టనున్నారు. తాజాగా ఏపీ టూరిజం వాళ్ళు కూడా అరకు నుంచి డుడుమకు ప్యాకేజీలను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇలా సరిహద్దులో ఉన్న రెండు రాష్ట్రాలవారు పర్యాటకంపై దృష్టి సారించడం శుభప్రదం.
డుడుమ జలపాతానికి త్వరలో మంచి రోజులు - andhra
ప్రకృతి పంచిన పచ్చదనం,జలపాతాల సవ్వడి..పర్యాటకులకు ఇంతకన్న ఏం కావాలి. ఈ రెండు పుష్కలంగా ఉన్న ఆంధ్ర ఒడిషా సరిహద్దులోని డుడుమా జలపాతం అభివృద్ది చేసేందుకు రెండు రాష్ట్రాలు చేతులు కలిపాయి.
'దుడుకు జలపాతానికి మంచి రోజులొస్తున్నాయోచ్..'
ఇదీ చూడండి:ప్రకృతి అందానికి.. ఫిదా అవ్వాల్సిందే...
Last Updated : Aug 9, 2019, 1:34 PM IST