ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 28, 2022, 8:58 AM IST

ETV Bharat / state

AP TOPNEWS ప్రధానవార్తలు@9am

..

9am topnews
ప్రధానవార్తలు9am

  • ఏపీకి మెట్రో అందని ద్రాక్షగానే మిగిలిపోనుందా..?
    కొన్ని రాష్ట్రాల్లో 3, 4 నగరాల్లో మెట్రో రైళ్లు ఉండగా... మరికొన్ని చోట్ల ఆయా ప్రభుత్వాలు విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ప్రతిపాదనలు పంపిన రాష్ట్రాలకు 2019-20 నుంచి దేశవ్యాప్తంగా, కేంద్రం 75,111 కోట్ల నిధులు మంజూరు చేసింది. విభజన చట్టంలో ఉండి కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉన్నా సరే.. సీఎం జగన్‌ మాత్రం ప్రతిపాదనలు పంపడంలేదు. ఒక్క రూపాయీ తేలేదు. ఇలా చివరకు ఏపీని ఒడిశా, ఝార్ఖండ్‌ వంటి వెనుకబడిన రాష్ట్రాల సరసన నిలిపిన ఘనతను జగన్‌ ప్రభుత్వం దక్కించుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సంక్రాంతి నెలలోనైనా సకాలంలో జీతాలు అందుతాయో లేదో...?
    Andhra Pradesh Appulu In YCP Govt: ఎవరైనా కొత్త సంవత్సరానికి ఆనందంతో స్వాగతం పలుకుతారు. కానీ వైసీపీ సర్కారు అనాలోచిత విధానాలతో కొత్త ఏడాదికి అప్పులతో స్వాగతం పలకాల్సిన పరిస్థితి తలెత్తింది. ఉద్యోగులకు నవంబరు నెల జీతాలు, పెన్షన్లు చెల్లించడానికే నానా అగచాట్లు పడాల్సి వచ్చింది. కొత్త ఏడాది సంక్రాంతి నెలలోనైనా సకాలంలో జీతాలు అందుతాయో లేదోనని వేతనజీవులు ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రాన్ని ప్రసన్నం చేసుకుని కొత్త రుణాలు సంపాదించుకునేందుకు ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక యంత్రాంగం దిల్లీలోనే ఉంది. ముఖ్యమంత్రి జగన్‌ సైతం దిల్లీ వెళ్లడం, బుధవారం ప్రధాని మోదీతో సమావేశమవుతుండటమూ ఈ సందర్భంగా చర్చనీయాంశమవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రైతులకు ఇచ్చిన అసైన్డ్‌ భూముల్లో మైనింగ్‌ తవ్వకాలు
    Murikipudi Granite Mafia:ఎసైన్డు భూముల్లో మైనింగ్‌కు అనుమతులిచ్చారంటూ.... పల్నాడు జిల్లా మురికిపూడి దళిత రైతులు న్యాయస్థానానికి వెళ్లడం కలకలం రేపింది. గతంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నిరుపేదలకు ప్రభుత్వం బీ-ఫాం పట్టాలను మంజూరు చేసింది. ఆ భూముల్లో గ్రానైట్‌ తవ్వకాలకు ప్రభుత్వ యంత్రాంగం నిరభ్యంతర పత్రాలు ఎలా ఇస్తారంటూ సాగుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వేల సంఖ్యలో వృద్ధాప్య, వితంతు పింఛన్లకు కోత
    Pensioners Concerns: కన్నవారి ఆదరణ కరవై, కట్టుకున్న వారి తోడుకు దూరమై.. పింఛన్ మీదే ఆధారపడి బతుకుతున్న వారు ఎందరో. అలాంటి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పింఛన్లు తొలగిస్తూ.... వారి గుండెకోతకు కారణమవుతోంది.... రాష్ట్ర ప్రభుత్వం. జనవరి నుంచి పెంచిన కొత్త పింఛన్లు ఇస్తామని గొప్పలు చెప్పిన వైకాపా సర్కార్‌.... లేనిపోని సాకులతో పింఛన్లు తీసివేయడంపై నిరుపేదలు లబోదిబోమంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అట్టహాసంగా శబరిమల అయ్యప్ప మండల పూజ.. అప్పటి వరకు ఆలయం మూసివేత
    శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం మధ్యాహ్నం మండల పూజను అట్టహాసంగా నిర్వహించారు. శబరిమల ఆలయ ప్రాంగణమంతా అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 26 సార్లు ట్రాఫిక్ రూల్స్​ ఉల్లంఘన.. రూ.16 వేలు ఫైన్.. బైకర్ ఏం చేశాడంటే?
    ఓ బైకర్​ ఏకంగా 26 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడు. అతడికి పోలీసులు రూ.16 వేలు జరిమానా విధించారు. ఈ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కొత్తగా మరో ఇన్ఫెక్షన్​.. మెదడును తినేస్తుందట..! ఇప్పటికే ఒకరు మృతి
    ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న వేళ.. దక్షిణ కొరియాలో మరో అరుదైన ఇన్ఫెక్షన్​తో ఓ వ్యక్తి మృతిచెందాడు. మెదడును తినేసే ఈ ఇన్ఫెక్షన్​ ముక్కుద్వారా మనిషిలోపలికి ప్రవేశిస్తుందని వైద్యులు గుర్తించారు. అయితే దీనిపై పరీక్షలు జరిగిన శాస్త్రవేత్తలు ఇది అంటువ్యాధి కాదని తేల్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'కొవిడ్​ అనంతరం సొంత కార్లకు గిరాకీ.. సంక్రాంతి నుంచి బీఎస్‌ 6.2 మోడళ్లే'
    కొవిడ్​ పరిణామాల అనంతరం చాలా మంది సొంత వాహనాల కొనుగోళ్లకు బాగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో కార్లుకు గిరాకీ అనూహ్యంగా పెరిగింది. కొన్ని రోజులు క్రితం వరకు కొత్త కారు కొందామన్నా, వారాలు-నెలల తరబడి సరఫరా చేయలేని స్థితిని కంపెనీలు ఎదుర్కొన్నాయి. కానీ ఇప్పుడు కొన్నిమోడళ్లకు గిరాకీ ఉన్నా కంపెనీలు దాదాపు రూ.10,000 నుంచి రూ.1లక్ష వరకు రాయితీలను అందిస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే.. బీఎస్​ 6.1 మోడళ్లు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి రిజిస్టర్​ కావని.. ఫ్రెంచ్‌ సంస్థ రెనో అనుబంధ రెనో ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ మామిళ్లపల్లి వెంకట్రామ్‌ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 12 ఏళ్ల నిరీక్షణకు సాక్ష్యాలు.. జెర్సీలపై సంతకాలు చూసి మురిసిపోయిన ఉనద్కత్‌
    దాదాపు పన్నెండేళ్ల తర్వాత రెండో టెస్టు మ్యాచ్‌ ఆడిన జయ్‌దేవ్‌ ఉనద్కత్ ఆనందం వర్ణించలేనిది. ఆ మ్యాచ్‌, ఈ మ్యాచ్‌కు సంబంధించి రెండు జెర్సీలను అపూరంగా చూసుకుంటూ మురిసిపోయాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బాక్సాఫీస్‌కు కొత్త జోష్‌ అందించిందెవరు? ఈ ఏడాది అదరగొట్టిన స్టార్​ హీరోలు
    అగ్ర కథానాయకులు బరిలో దిగితే.. బాక్సాఫీసు ముందు కనిపించే ఆ సందడి మరో స్థాయిలో ఉంటుంది. కుటుంబ సమేతంగా ప్రేక్షకులు థియేటర్లకు వరుస కట్టాలన్నా.. రికార్డు స్థాయి వసూళ్లతో బాక్సాఫీస్‌ కళకళలాడాలన్నా అగ్రతారల చిత్రాలు రంగంలోకి దిగాల్సిందే. కొవిడ్‌ పరిస్థితుల వల్ల గత రెండేళ్ల కాలంలో అగ్రకథానాయకుల సందడి అంతగా కనిపించలేదు. కానీ, ఈ ఏడాది వైరస్‌ ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో.. టాప్‌ స్టార్లంతా జోరు చూపించారు. ఒకరిద్దరు మినహా మిగతా అగ్ర హీరోలంతా వరుస సినిమాలతో థియేటర్లలో సందడి చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details