- 'పెద్ద నోట్ల రద్దు సరైనదే'.. కేంద్రం నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు
మోదీ సర్కారుకు ఊరట లభించింది. పెద్ద నోట్ల రద్దు సరైనదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్బీఐని సంప్రదించిన తర్వాతే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నందున.. ఆ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని పేర్కొంది. ఈ మేరకు తీర్పు వెలువరించింది.
- 86 ఏళ్ల వయస్సులో ఆరు నిమిషాలు శీర్షాసనం వేసి గిన్నిస్ రికార్డ్
కొందరు యువకులకు సాధారణ ఆసనాలు వేస్తేనే ఆయాసంగా అనిపిస్తుంది. అలాంటిది కూర్చోవడమే కష్టమైన వృద్ధాప్యంలో శీర్షాసనం వేయడం అసాధారణ విషయం. అయితే, అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించారు ఒడిశా రవూర్కెలాలోని ఈశ్వర్నాథ్ గుప్తా. కోయెల్ నగర్ ప్రాంతానికి చెందిన ఆయన కొత్త సంవత్సరం జనవరి ఒకటో తేదీన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షంలో ఆరు నిమిషాల 36 సెకన్ల పాటు శీర్షాసనం వేశారు.
- రాష్ట్రంలోని ఎయిపోర్టుల్లో నిలిచిన కార్గో సేవలు.. అనుమతులపై ఆరు నెలల ముందే సూచన
విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవరం సహా దేశంలోని 20 విమానాశ్రయాల్లో సరకు రవాణా సేవలు జనవరి1 నుంచి నిలిచిపోయాయి. అనుమతులను పునరుద్ధరించుకోవాలంటూ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆరు నెలల కిందట సూచించినప్పటికీ.. జరగకపోవడంతో తాజాగా సరకు రవాణా సేవలను ఆపేస్తున్నట్టు బీసీఎఎస్ ప్రకటించింది. దీంతో సరకు రవాణాకు తీవ్ర విఘాతం కలుగుతోంది. విశాఖ, విజయవాడల్లోని ఆసుపత్రులకు వచ్చే అత్యవసర మందులు ఆగిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..
- న్యూఇయర్ ఎఫెక్ట్.. ఏపీలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు..!
2023 effect record revenue increased in AP: నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో మద్యం పొంగిపొర్లింది. ఒక్కరోజేలోనే ఊహించని స్థాయిలో రికార్డు ఆదాయం వచ్చింది. మద్యం విక్రయాల ద్వారా భారీ ఆదాయాలే లక్ష్యంగా ప్రభుత్వం.. మద్యం దుకాణాలు, బార్లలో నిర్దేశిత సమయం కంటే అదనంగా మరో మూడు గంటలు విక్రయించేందుకు అనుమతిచ్చింది.
- హరిరామ జోగయ్య ఆరోగ్యంపై పవన్ కళ్యాణ్ ఆందోళన
Pawan Kalyan Comments: కాపు రిజర్వేషన్ కోసం చేగొండి హరిరామ జోగయ్య తలపెట్టిన దీక్షపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. వెంటనే చర్చలు జరపాలని పవన్ కోరారు
- గుంటూరు ఘటనలో మృతుల కుటుంబాలకు భారీగా అర్థిక సాయం..
Uyyuru Foundation: చంద్రన్న కానుకల పంపిణీ ఘటనలో మృతులకు.. నష్టపరిహారం చెల్లించాలని సీఎం జగన్ ఆదేశించారు. మృతల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. అటు ఘటనకు బాధ్యత వహిస్తూ.. ఉయ్యూరు ఫౌండేషన్ మృతుల కుటుంబాలకు భారీ సాయం ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.20 లక్షల సాయం అందించనున్నట్లు ఉయ్యూరు శ్రీనివాస్ వెల్లడించారు. అటు చంద్రబాబు కూడా పార్టీ తరుపున మృతుల కుటుంబసభ్యులకు రూ. 5లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
- చెస్ పోటీల్లో దేశానికి మరిన్ని పతకాలు తెస్తానంటున్న కోనేరు హంపి
కజకిస్థాన్‌లో జరిగిన ప్రపంచ రాపిడ్, బ్లిట్జ్ చెస్ ఛాంపియన్ షిప్ పోటిల్లో విజయవాడకు చెందిన తెలుగమ్మాయి ప్రముఖ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి సత్తా చాటింది. మహిళల విభాగంలో తొలిసారిగా భారత్‌కు వెండి పతకాన్ని సాధించి పెట్టింది. క్లిష్టమైన ఈ ఆటలో తాను విజయం సాధించేందుకు ఎంతో కష్టపడినట్లుగా తెలిపింది. ఇప్పటి వరకు ఎవరూ సాధించని రికార్డును తాను నమోదు చేయడం పట్ల గర్వంగా ఉందని చెప్పింది.
- వేగంగా కోలుకుంటున్న పంత్.. ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి షిఫ్ట్
క్రికెటర్ రిషభ్ పంత్ ఆరోగ్య పరిస్థితిపై ఓ అప్డేట్ వచ్చింది. ఆసుపత్రిలో చేరినప్పటి కంటే ఇప్పుడు పంత్ ఆరోగ్యం మెరుగుపడింది. ప్రస్తుతం అతడిని ఐసీయూ నుంచి ప్రత్యేకమైన గదికి మార్చారు. రిషబ్ పంత్ చాలా వేగంగా కోలుకుంటున్నాడని మ్యాక్స్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
- జైలుపై ముష్కరుల దాడి.. 14 మంది మృతి.. మరో 13 మందికి గాయాలు
మెక్సికోలోని ఓ జైలులో కాల్పులు కలకలం సృష్టించాయి. ముష్కరులు జరిపిన కాల్పుల్లో 14 మంది మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు.
- సమంత ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 'శాకుంతలం' విడుదలయ్యేది అప్పుడే
'శాకుంతలం' మూవీ అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు తీపి కబురు. సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. రిలీజ్ ఎప్పుడంటే?