- 40 వేల పింఛన్లు కోత.. ఆందోళనలో బాధితులు
40 వేల సామాజిక భద్రత పింఛన్లకు రాష్ట్ర ప్రభుత్వం కోత వేసింది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, డప్పు కళాకారులు, చేనేత కార్మికులకు ఇచ్చే డిసెంబరు, జనవరి నెల పింఛన్ల పరిశీలనలో ఈ తగ్గింపు కనిపించింది. ప్రభుత్వం ఏ కారణంతో తొలగించిందీ ఎక్కడా వెల్లడించ లేదు.
- రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటిన నూతన సంవత్సర వేడుకలు
కోటి ఆశలతో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ.. నూతన ఆంగ్ల సంవత్సర వేడుకల్ని రాష్ట్ర ప్రజలు ఉరిమే ఉత్సాహంతో జరుపుకున్నారు. బాణసంచా వెలుగుల్లో, విద్యుత్‌దీప కాంతుల్లో ఆకాశమే హద్దుగా ఆటపాటలతో సందడి చేశారు. కొత్త సంవత్సరంలో అంతా మంచే జరగాలని, ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ..కేకులు కోసి, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.
- మూడున్నరేళ్లైనా ఆ ఊసే లేదు.. ఒక్క పోస్టూ భర్తీ కాలేదు
అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహిస్తామంటూ ప్రతిపక్షంలో ఉండగా ఊదరగొట్టిన జగన్.. మూడున్నర ఏళ్లు గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదు. ఇప్పటివరకూ ఒక్క పోస్టూ భర్తీ కాలేదు. పోనీ ఇకనైనా పోస్టులు తీస్తారా అంటే లేదని చెప్పాలి. ఎందుకంటే హేతుబద్ధీకరణ, తరగతుల విలీనం పేరిట ఇప్పుడు ఉపాధ్యాయ ఖాళీల సర్దుబాటు చేస్తున్నారు. దీంతో టీచర్ల కొలువుపై ఎంతోమంది ఆశలు గల్లంతైనట్టేనని.. జగన్ హామీల వలలో చిక్కుకొని నిండా మినిగిపోయారని ఉపాధ్యాయ, సామాజిక సంఘాల నాయకులు అంటున్నారు.
- పింఛన్ రూ.2,750.. నేటి నుంచి పెంపు వారోత్సవాలు
250 పెంపుతో నేటి నుంచి 2 వేల 750 రూపాయల చొప్పున సామాజిక భద్రత పింఛన్లు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రూ.2,750 చొప్పున సామాజిక భద్రత పింఛను ఇవ్వనున్నారు. వైఎస్ఆర్ పింఛను కానుక కింద కొత్తగా 2 లక్షల31 వేల 463 మందికి పింఛన్లు అందజేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు వెల్లడించారు. పింఛన్ల పంపిణీకి అవసరమైన 1765 కోట్ల రూపాయల్ని సీఎం విడుదల చేశారన్నారు.
- రాజకీయ సెమీఫైనల్‌గా 2023.. ఏడాదిలో 9 రాష్ట్రాలకు ఎన్నికలు
కొత్త సంవత్సరంలో తొమ్మిది రాష్ట్రాల శాసనసభలకు జరిగే ఎన్నికలు- భాజపా, కాంగ్రెస్‌లతోపాటు కొన్ని ప్రాంతీయ పార్టీలకూ కీలకమే! 2024లో జరిగే లోక్‌సభ సాధారణ ఎన్నికలకు వీటిని సెమీఫైనల్ పోరుగా భావిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాకు, విపక్ష కాంగ్రెస్‌కు కీలక రాష్ట్రాలు కావడంతో పోటీ ప్రతిష్ఠాత్మకంగా మారనుంది. జాతీయ పార్టీగా ఆవిర్భవించిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కీ ఈ ఏడాది ముఖ్యమే. ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయాలన్న ప్రయత్నాల్లో ఉండటంతోపాటు, తెలంగాణ శాసనసభకూ ఎన్నికలు జరగనుండటంతో కొత్త సంవత్సరం కీలకం కానుంది.
- ప్రపంచవ్యాప్తంగా ఘనంగా న్యూఇయర్ సంబరాలు
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. 2022కు వీడ్కోలు పలికిన అక్కడి ప్రజలు 2023కు ఆనందోత్సాహాలతో ఆహ్వానం పలికారు. బాణసంచా, రంగురంగుల విద్యుత్ దీప కాంతులతో ఆయా నగరాలు జిగేల్మంటున్నాయి.
- ఈ ఏడాది అన్ని రంగాలకు కలిసొచ్చే కాలమే!
గత ఏడాదిలో (2022) స్టాక్ మార్కెట్ తీవ్రమైన హెచ్చుతగ్గులతో మదుపరులను ఇబ్బంది పెట్టింది. డిఫెన్స్, బ్యాంకింగ్ రంగాలకు చెందిన కంపెనీల షేర్లు ఆకర్షణీయమైన ప్రతిఫలాన్ని ఇవ్వగా, ఐటీ, ఫార్మా రంగాలకు చెందిన షేర్లు చుక్కలు చూపించాయి. 2023 స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
- 2023 సమరం ఆరంభం.. ఇక సమయం లేదు మిత్రమా..!
ప్రపంచ కప్‌ను ముద్దాడాలని భారత్ ఎంతో ఊవిళ్లూరుతోంది. ఓ వైపు క్రికెట్.. మరోవైపు హాకీ.. ఇంకోవైపు ఫుట్‌బాల్.. ఇలా 2023లో ఎటు చూసినా ప్రపంచకప్‌ల జోరు మొదలయ్యింది. మరోవైపు బరిలో సమర శంఖాన్ని మోగించేందుకు మన ప్లేయర్లు సిద్ధంగా ఉన్నారు. మరి ఈ 2023 భారత క్రీడా ప్రపంచం ఎలా ఉండనుందో ఓ సారి చూద్దామా..
- 'వీర సింహారెడ్డిలో ఇంటర్వెల్, వాల్తేరు వీరయ్యలో రవితేజ ఎపిసోడ్.. చూస్తే కన్నీళ్లు ఖాయం!'
రామ్-లక్ష్మణ్.. ఎన్నో సూపర్‌హిట్ సినిమాలకు యాక్షన్ కొరియోగ్రఫీ చేసిన కవల సోదరులు. సంక్రాంతి రేసులో ఉన్న చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' , బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' చిత్రాల్లో ఫైట్ సీక్వెన్స్‌లు డిజైన్ చేసింది వీరే. ఆ రెండు సినిమాల గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు రామ్-లక్ష్మణ్.