- తల్లికి కన్నీటి వీడ్కోలు అంతిమ సంస్కారాలు నిర్వహించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు ముగిశాయి. గాంధీనగర్‌లోని శ్మశానవాటికలో హీరాబెన్ అంత్యక్రియలు పూర్తిచేశారు. మోదీ తన సోదరులతో కలిసి ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తన తల్లి చితికి మోదీ నిప్పు పెట్టారు. తమ కుటుంబ సంప్రదాయాల ప్రకారం కుటుంబ సభ్యులంతా తుది హీరాబెన్‌కు తుది వీడ్కోలు పలికారు.
- 'ఇండియా ఫస్ట్'.. తల్లి మరణించిన బాధలోనూ కర్తవ్యాన్ని మరవని మోదీ
తల్లి మరణించిన బాధను దిగమింగుకుని తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ. బాధలో ఉన్నా సరే.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బంగాల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.
- కేసుల పరిష్కారంలో జాప్యాన్ని నివారించి.. సత్వర న్యాయం అందేలా చూడాలి: సీజేఐ
కేసుల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలని.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్.. సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని కాజ వద్ద నిర్మించిన ఏపీ జ్యుడీషియల్ అకాడమీ భవనాన్ని.. ఆయన ప్రారంభించారు. అనంతరం నాగార్జున యూనివర్సిటీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఆన్లైన్ ద్వారా హైకోర్టు రికార్డుల డిజిటలైజేషన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.
- మాటపై నిలబడాలన్న రైతులు.. ప్రశ్నలొద్దంటూ, దాడికి దిగిన ఎమ్మెల్యే వర్గీయులు
రాజోలి జలాశయం భూసేకరణ పరిహారంపై ప్రశ్నించిన అన్నదాతలపై జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు దాడి చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూడేళ్లుగా నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్న రైతన్నలు జలాశయం సామర్థ్యం తగ్గిస్తామనే కలెక్టర్ మాటలతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేను ప్రశ్నించగా వైసీపీ వర్గీయులు రెచ్చిపోయి రైతులపై దాడి చేశారు.
- వైసీపీ కార్యాలయానికి భూమి.. 33 ఏళ్ల లీజు.. ఏడాదికి ఎకరానికి వెయ్యి
వైసీపీ కార్యాలయాల నిర్మాణం కోసం 3 జిల్లాల్లో 55 కోట్ల రూపాయల విలువైన 4.75 ఎకరాల భూములను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. కడపలో కేటాయించిన భూమి మార్కెట్ విలువ రూ.30 కోట్లు, అనకాపల్లి జిల్లా రాజుపాలెంలో 1.75 ఎకరా వైసీపీ కార్యాలయానికి ఇచ్చారు.
- అంబులెన్స్‌కు డబ్బులేక భర్త మృతి.. అలా ఎవరికీ కాకూడదని ఆమె ఏం చేసిందంటే?
చనిపోయిన తన భర్త జ్ఞాపకార్థంగా తక్కువ ధరకే అంబులెన్స్ సేవలను అందిస్తోంది ఓ మహిళ. ఇలా ఆపదలో ఉన్నవారికి తన వంతు సాయం చేస్తూ అనేక మంది మనసుల్లో చోటు సంపాదించుకుంది. మరి ఆమె విశేషాలేంటో తెలుసుకుందాం రండి..
- మాచర్ల ఘటనలో గాయపడిన వారి వైద్య నివేదికను సమర్పించండి: హైకోర్టు
మాచర్ల దాడుల ఘటనలో గాయపడిన వారికి సంబంధించిన వైద్య నివేదికలను తమ ముందు ఉంచాలని.. పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగిరెడ్డిని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి ఈ మేరకు గురువారం ఆదేశాలిచ్చారు.
- పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేటి లెక్కలు ఇలా..
Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
- పంత్‌కు ఘోర రోడ్డు ప్రమాదం.. కారులో చెలరేగిన మంటలు.. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి..
టీమ్ఇండియా క్రికెటర్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతడు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం వాహనంలో మంటలు చెలరేగాయి. ఉత్తరాఖండ్ నుంచి దిల్లీ వెళ్తుండగా రూర్కీ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో తన మెర్సిడెస్ కారును పంతే నడుపుతున్నట్లు సమాచారం అందింది.