- కందుకూరు ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
నెల్లూరు జిల్లా కందుకూరు ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి చెందారు.. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ప్రధాని.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు..
- కీలక ఘట్టానికి వేదికైన బాపట్ల.. హైవే పై అత్యవసర విమాన ల్యాండింగ్ కు నేడు పరీక్ష
ప్రకృతి విపత్తులు, యుద్ధ సమయాల్లో ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు వీలుగా రవాణా వ్యవస్థ మెరుగైన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా చేపట్టిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి బాపట్ల జిల్లా పరిధిలోని చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి వేదిక కానుంది. అత్యవసర పరిస్థితుల్లో విమానాలు దిగేందుకు వీలుగా హైవేపై నిర్మించిన ఎయిర్ స్ట్రిప్‌పై నేడు ల్యాండింగ్ టెస్ట్ జరుగనుంది. దక్షిణ భారతదేశంలో మొదటిసారి ఇలాంటి ట్రయల్‌రన్ జరుగుతోంది. ఉదయం 11గంటలకు నిర్వహించే ట్రయల్ రన్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు.
- తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
రాష్ట్రంలో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.. తొలుత శ్రీవారి దర్శించుకుని.. తరువాత ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకుని.. హైకోర్ట్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు..
- కందుకూరులో చంద్రబాబు సభకు నామమాత్రపు బందోబస్తు.. పోలీసుల తీరుపై విమర్శల వెల్లువ
నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ సభలో తొక్కిసలాటలో 8 మంది మృతి చెందడం తీవ్ర చర్చాంశనీయంగా మారింది. ముఖ్యంగా పోలీసుల తీరుపైనే అందరి దృష్టి నెలకొంది. ఈ నెల 26న మంత్రి ఆదిమూలపు సురేష్ తల్లి మృతి చెందారు. ఆ తర్వాత రోజు ముఖ్యమంత్రి రాగా ఒక్క రోజులోనే వెయ్యి మందితో బందోబస్తు నిర్వహించారు. చంద్రబాబు పర్యటనలో మాత్రం పోలీసులు ఆ స్థాయిలో కనిపించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
- దట్టమైన పొగమంచు.. చెరువులోకి దూసుకెళ్లిన బస్సు.. 50 మందికిపైగా..
పొగమంచు కారణంగా 80 మంది కూలీలతో వెళ్తున్న బస్సు.. రోడ్డు పక్కన చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 50 మందికిపైగా కూలీలు గాయపడ్డారు.
- భారతీయ పట్టాలపై 'హైడ్రోజన్ రైలు' కూత.. ప్రత్యేకతలేంటో తెలుసా?
వాతావరణ మార్పులకు చెక్‌పెట్టేలా, ప్రజారోగ్యానికి మేలు చేసేలా భారతీయ రైల్వేశాఖ సరికొత్త అడుగులు వేస్తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన దేశ తొలి హైడ్రోజన్ రైలును కొత్త సంవత్సరంలో ఆవిష్కరించబోతోంది. కాలుష్యకారక డీజిల్ ఇంజిన్ల స్థానంలో వీటిని ప్రవేశపెట్టబోతోంది. సంప్రదాయ రైలుతో పోలిస్తే ఇది చిన్నగా ఉంటుందని, అందులో 6-8 కోచ్‌లు మాత్రమే ఉంటాయని రైల్వే మంత్రి సంకేతాలిచ్చారు. పారిస్ ఒప్పందం కింద వాతావరణ లక్ష్యాలను సాధించడానికి ఇది దోహదపడుతుంది.
- ఇక చైనాకు వెళ్లొచ్చు, రావొచ్చు.. 3 ఏళ్ల తర్వాత ప్రయాణ ఆంక్షలు ఎత్తివేసిన డ్రాగన్
కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న వేళ.. చైనా ప్రయాణ ఆంక్షలను సడలించింది. దాదాపు మూడేళ్ల తర్వాత తన దేశ సరిహద్దులను అంతర్జాతీయ ప్రయాణికులకు తెరిచింది. పాస్‌పోర్టు, వీసా సేవలను వచ్చే నెల 8వ తేదీ నుంచి పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు, చైనాను ఇప్పుడు యాంటీ వైరల్ డ్రగ్స్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో ఆ దేశవాసులు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి భారత్‌వైపు చూస్తున్నారు.
- ముకేశ్@ 20 ఏళ్ల ఇండస్ట్రీ.. రూ.42 వేల కోట్ల నుంచి రూ.17 లక్షల కోట్లకు..
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) వ్యాపార సామ్రాజ్య సారథిగా ముకేశ్ అంబానీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ రెండు దశాబ్దాల కాలంలో సంస్థ ఆదాయాలు 17 రెట్లు, లాభాలు 20 రెట్లు పెరగడమే కాకుండా.. ప్రపంచ దిగ్గజ సంస్థల్లో ఒకటిగా అవతరించింది.
- పావులు చూసి.. ఎత్తులు వేసి.. ప్రపంచ ర్యాపిడ్ చెస్‌లో 'చెన్నై' టీనేజర్ సంచలనం
సోదరుడు చదరంగం ఆడుతుంటే.. ఆ తెలుపు, నలుపు గళ్లు.. ఆ పావులు.. ఆ చిన్నారి దృష్టిని ఆకర్షించాయి. ఎత్తులు వేస్తూ.. ప్రత్యర్థులను చిత్తుచేయడాన్ని ఆమె ఇష్టపడింది. నాలుగేళ్ల వయసులో చెస్‌తో ప్రయాణాన్ని మొదలెట్టింది. కట్ చేస్తే.. ఇప్పుడామె ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ కాంస్య విజేత. ర్యాంకుల్లో మెరుగైన క్రీడాకారిణులను ఓడించి.. అంతర్జాతీయ వేదికపై మెరిసిన చెన్నై టీనేజర్. ఆమెనే.. 15 ఏళ్ల సంచలనం సవితశ్రీ.
- 'సక్సెస్' సొగసులెన్ని?.. 2022లో అలరించిన అగ్ర కథానాయికలు వీళ్లే!
చిత్రసీమలో విజయాలున్న కథానాయికలకి తిరుగే ఉండదు. ఇక స్టార్ హోదా కూడా దక్కించుకున్నారంటే అగ్ర కథానాయకుల చిత్రాల్లో నటించే అవకాశాలు వరుస కడతాయి. వాళ్ల కోసం దర్శకనిర్మాతలు చిత్రీకరణలు కూడా వాయిదా వేసుకుంటారు. మార్కెట్‌పై అంతగా ప్రభావం చూపిస్తుంటారు. ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నా పోటీ పెరిగినా.. కొద్దిమంది కథానాయికలు మాత్రం ఇప్పటికీ జోరు చూపిస్తున్నారు. 2022లో వాళ్ల ప్రభావం ఎలా సాగిందో తెలుసుకుందాం.