- స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?
భారత్‌లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 227 మందికి కొవిడ్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ధారించింది. రికవరీ రేటు 98.80 శాతంగా ఉందని.. యాక్టివ్ కేసులు 0.01 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే : నారా లోకేశ్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముస్లిం మైనార్టీ ప్రముఖులు, తెలుగుదేశం నేతలతో భేటీ అయ్యారు. మైనార్టీలకు తమ తరపున పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ముస్లిం, మైనార్టీలపై దాడులు తీవ్రమయ్యాయని మైనార్టీ ప్రతినిధులు లోకేశ్‌కు విన్నపించుకున్నారు..
- రాయచోటిలో ప్రభుత్వ భూమిపై వైసీపీ నేత కన్ను..
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో ప్రభుత్వ భూములపై అధికార పార్టీ నేతలు కన్నేశారు. బినామీల పేరిట హస్తగతం చేసుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. గతంలో విపక్షాలు చేసిన ఆరోపణలు నిజం చేస్తూ ఓ ప్రజాప్రతినిధి ఏకంగా 150 కోట్ల విలువైన భూమి కొట్టేసేందుకు పథక రచన చేశారు. తన అనుచరుల పేరిట ఏకంగా అక్రమ రిజస్ట్రేషన్ చేయించారు.
- ఆర్టీసీ ఛార్జీల మోతలో.. పోటీపడుతున్న రెండు తెలుగు రాష్ట్రాలు
ఆర్టీసీ ఛార్జీల పెంపులో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీపడుతున్నట్లు అనిపిస్తోంది. దీంతో ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. పెరిగిన టికెట్ ధరల వలన ప్రయాణికులపై భారీగా భారం పడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో ఆర్టీసీ ఛార్జీలు తక్కువగానే ఉన్నాయి.
- 'ఆపరేషన్ ధృవ' సక్సెస్.. ఇటుక బట్టీల వద్దకే బడి పాఠాలు
ఇటుక బట్టీల్లో అక్షరచైతన్యం మొదలైంది. తల్లిదండ్రులతో కలిసి బట్టీల్లోకి పనులకు వెళ్లకుండా చదువుకునేందుకు తెలంగాణలోని పెద్దపల్లి పోలీసులు ఆపరేషన్ ధృవ పేరుతో పకడ్బందీ ఏర్పాట్లు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. దశాబ్దాలుగా ఉపాధి కోసం తల్లిదండ్రులు వలస వస్తే వారితో వచ్చే చిన్నారుల బాల్యం బుగ్గిపాలవుతోంది. పలక, బలపం పట్టాల్సిన చిట్టిచేతులు బట్టీల్లో ఇటుకలను పట్టేపరిస్థితి ఉండేది. దీనిని నివారిస్తూ.. ప్రస్తుతం పోలీసులు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి చిన్నారులు చదువుకునే ఏర్పాటు చేశారు.
- ఆధార్ తీసుకొని పదేళ్లయిందా..? అయితే తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాల్సిందే
ఆధార్ తీసుకొని పదేళ్లయినా ఒక్కసారి కూడా అప్డేట్ చేయని వాళ్లు తప్పనిసరిగా కార్డు వివరాలను అప్డేట్ చేసుకోవాలని భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఐఏ)సూచించింది.
- ఏవీ గత క్రిస్మస్ కాంతులు..! రష్యా దండయాత్రతో వేడుకలకు దూరంగా ఉక్రెయిన్
వైమానిక దాడులతో ఉక్రెయిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రష్యా.. యుద్ధ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా అనేక దారుణాలకు పాల్పడుతుంది. ఉక్రెయిన్‌పై దండయాత్ర సాగిస్తున్న రష్యా సైనికులు అరాచకాలు సృష్టిస్తున్నారు. గత సంవత్సరం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్న ఉక్రెయిన్.. ఇప్పుడు యుద్ధంతో విలవిలలాడుతుంది.
- ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆ దేశాల నుంచే అధిక ముప్పు : నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ జోసెఫ్ స్టిగ్లిట్జ్
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అమెరికా, రష్యా, చైనాల నుంచి ముప్పు పొంచి ఉందని ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ జోసెఫ్ స్టిగ్లిట్జ్ అభిప్రాయపడ్డారు. వడ్డీ రేట్ల పెంపుతో ద్రవ్యోల్బణం తగ్గదని దాని కారణంగా నిరుద్యోగిత మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కూడా అనేక దేశాల ఆర్థికవ్యవస్థలను దెబ్బతీసిందని అన్నారు. మరో ఆర్థిక సంక్షోభం ప్రపంచాన్ని చుట్టుముట్టనుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన 'ఈటీవీ భారత్' ప్రతినిథి ఎం.ఎల్. నరసింహారెడ్డికి ఇచ్చిన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలివి..
- టీమ్ఇండియాకు బిగ్ షాక్.. శ్రీలంక సిరీస్‌కు కోహ్లీ, రోహిత్, రాహుల్ డౌట్!
కొత్త ఏడాదిలో శ్రీలంకతో జరగబోయే టీ20 సిరీస్‌కు టీమ్ఇండియా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు ఓపెనర్ కేఎల్ రాహూల్ దూరం కానున్నట్లు తెలిసింది.
- తెలుగు పరిశ్రమ మరో మంచి నటుడిని కోల్పోయింది: బాలకృష్ణ
సీనియర్ నటుడు చలపతిరావు మరణంతో చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.