- ఫ్లెక్సీ రంగం కార్మికులను ఆదుకుంటాం.. : నీరభ్ కుమార్ ప్రసాద్
జనవరి 26 నుంచి రాష్ట్రంలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేదం అమల్లోకి వస్తోందని రాష్ట్ర పర్యావరణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ తెలిపారు.ప్లెక్సీ ప్రత్యామ్నయ మార్గాలపై విజయవాడలో ఆయన వర్క్ షాప్ ను ప్రారంభించారు. ఈ రంగంపై ఆధారపడిన వారికి నూతన పథకాలు ప్రవేశపెట్టి, ప్రభుత్వం అండగా ఉంటుందని .. నీరభ్ వెల్లడించారు.
- విజయనగరంలో చంద్రబాబు మూడు రోజుల పర్యటన ఏర్పాట్లు పూర్తి
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు "ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి" కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి మూడు రోజుల పాటు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. రాజాం, బొబ్బిలి, విజయనగరం నియోజకవర్గాల్లో నిర్వహించనున్న రోడ్ షో, బహిరంగ సభల్లో ఆయన పాల్గొననున్నారు. అదే విధంగా రాజాం, బొబ్బిలి ఓబీసీ వర్గాలతో వివిధ అంశాలపై ముఖాముఖి చేపట్టనున్నారు. బాబు పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు సర్వం సిద్ధం చేశారు.
- మీ ఇంట్లో వివాహేతర సంబంధాలున్నాయా?.. ప్రభుత్వ సర్వేలో ప్రశ్నలు..!
మామూలుగా రాష్ట్ర ప్రభుత్వ సర్వే అంటే ఇంట్లో ఉన్న వారి వివరాలు, లేకపోతే వారికి అందుతున్న సంక్షేమ వివరాలు సేకరించడం. ఇది సహజం, సర్వసాధారణం. కానీ వైసీపీ ప్రభుత్వ సర్వేలు మాత్రం ఇందుకు విరుద్ధం. ఎందుకంటారా.. ఇది చదవండి.. మీకే తెలుస్తోంది.
- దేవుడి భూములకు "ఎసరు" పెట్టిన మంత్రి బుగ్గన అనుచరుడు
రాష్ట్రంలో వైసీపీ నేతల దోపిడి అడ్డుఅదుపు లేకుండా పోతోంది.. చెరువు, నదులు, కొండలను దోచుకోవడం పూర్తయ్యాక..మిగిలినవి ఇంకేముంటాయి..దేవాలయ భూములే మిగులుంటాయి.. వాటిని కూడా వదలిపెట్టేదే లేదంటూ ఓ వేసీపీ నేత..దోచుకునేందుకు పన్నాగాలు మొదలు పెట్టి..ప్రారంబోత్సవం కూడా విజయవంతంగా పూర్తి చేశాడు.. ఇంత జరుగుతున్నాకానీ..అధికారులకు ఏమీ పట్టనట్టూ ఉండటం గమనార్ధం..
- భారత్-చైనా వివాదంపై చర్చకు విపక్షాల డిమాండ్.. లోక్‌సభ వాయిదా
చైనాతో భారత్ సరిహద్దు సమస్యపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టడం వల్ల లోక్‌సభ గురువారం వాయిదా పడింది. మరోవైపు, రాజ్యసభలో కూడా భారత్- చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై చర్చకు నిరాకరించినందుకు ప్రతిపక్షాలు సభను బహిష్కరించాయి.
- చేపలు పట్టడంలో శిబు స్టైలే వేరు.. సముద్రంలోకి డైవ్ చేసి బల్లెంతో వేట
మన దేశంలో తీరప్రాంత ప్రజలకు చేపల వేటే జీవనాధారం. అందుకు చాలా మంది తమ సంప్రదాయ పద్ధతులను కొనసాగిస్తుంటారు. కానీ చేపల పట్టడంలో కేరళలోని కొల్లాంకు చెందిన శిబు జోసెఫ్ స్టైలే వేరు. స్పెషల్ స్పియర్ గన్ను ఉపయోగించి శిబు చేపలను పట్టుకుంటాడు. డైవింగ్‌లో నిపుణుడు అయిన అతడు.. సముద్రంలోకి వెళ్తాడు. అక్కడ స్పియర్ గన్‌తో రకరకాల చేపలను ఫిషింగ్ చేస్తున్నాడు. ఆ చేపలను విక్రయించి మంచి డబ్బులును కూడా సంపాదిస్తున్నాడు. అయితే నిపుణుల దగ్గర శిక్షణ తీసుకోకుండా తనను ఎవరూ అనుకరించవద్దని శిబు కోరుతున్నాడు. అంతే కాకుండా తన ఫిషింగ్ వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి.
- నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశం.. సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ విడుదల!
ఆరోగ్య కారణాల రీత్యా అంతర్జాతీయ నేరగాడు చార్లెస్ శోభరాజ్‌ను విడుదల చేయాలని నేపాల్ సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం నేపాల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శోభరాజ్‌పై పెండింగు కేసులు లేకపోతే విడుదలైన తర్వాత స్వదేశానికి పంపేయాలని కోర్టు సూచించింది.
- షావోమీకు ఊరట.. రూ.3,700 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ల జప్తునకు నో
ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ షావోమీకి సంబంధించిన రూ.3,700కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ల జప్తుపై ఆదాయపు శాఖ జారీ చేసిన ఆదేశాలను కర్ణాటక హైకోర్టు తాత్కాలికంగా పక్కన పెట్టింది.
- పీసీబీ ఛీప్ రమీజ్ రాజాపై వేటు.. కొత్త ఛైర్మన్ ఎవరంటే?
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మెన్‌గా ఉన్న రమీజ్ రాజాను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది ఆ దేశ ప్రభుత్వం. కొత్త ఛైర్మన్‌ను నియమించింది.
- ఆ హీరోయిన్ నేను హాట్ పెయిర్: యంగ్ బ్యూటీపై బాలయ్య కామెంట్స్
ఓ హీరోయిన్‌పై కామెంట్స్ చేశారు నందమూరి నటసింహం బాలకృష్ణ. తాను ఆమె హాట్ పెయిర్ అని చెప్పారు. ఆ సంగతులు..