ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 11 AM - ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

..

AP TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు

By

Published : Dec 18, 2022, 11:02 AM IST

  • భయానకం.. బీభత్సం.. మాచర్లలో వైసీపీ నేతల అరాచకం
    బీభత్సం..భయానకం మాచర్లలో కొనసాగుతున్న అరాచకం రాజ్యమేలుతున్న తీరిది. నియోజకవర్గంలో అధికారమే అండగా వైసీపీ నేతలు పెట్రేగిపోతున్నారు. చెలరేగి ప్రతిపక్షపార్టీ నేతల ఆస్తులు, ప్రాణాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. ఆరాచకాలకు అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులు వారికి అండగా నిలవడంతో అడ్డూఅదుపూ లేకుండా పోయింది. పట్టపగలు గ్రామం నడిబొడ్డున గొంతు కోసి హత్య చేయడం ఇక్కడ జరుగుతున్న దమనకాండకు నిదర్శనం. ఇక్కడ ప్రత్యేక రాజ్యాంగం అమలవుతోంది. ప్రజాప్రతినిధి ఆదేశాలు చట్టంగా ఇక్కడి యంత్రాంగం చక్కబెడుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • విమర్శిస్తూ పోస్టులు పెట్టడం.. విద్వేషం రెచ్చగొట్టినట్లు ఎలా అవుతుంది: హైకోర్టు
    సామాజిక మాధ్యమాల్లో విమర్శిస్తూ పోస్టులు పెట్టడం రెండు సమూహాల మధ్య విద్వేషం రెచ్చగొట్టినట్లు ఎలా అవుతుందని పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టారన్న కారణంతో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ పోలీసులు గుంటూరు జిల్లా చినకాకానికి చెందిన సీహెచ్‌ గోపికృష్ణపై 2020మేలో నమోదు చేసిన కేసును కొట్టేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సీఎం బాపట్ల పర్యటన.. నిధులు లేక మండలాల నుంచి సమీకరణ
    బాపట్ల జిల్లా చండూరు మండలంలో ఈ నెల 21న ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లు చేయటానికి జిల్లా యంత్రాంగం నిధుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా.. చండూరులో విద్యార్థులకు ట్యాబ్​లు పంపిణీ చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • విజయవాడలో ఘనంగా గురుకుల పాఠశాలల జాతీయ క్రీడలు
    విజయవాడలో ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల జాతీయ స్థాయి క్రీడలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 22 వరకు నిర్వహించునున్నారు. దేశ వ్యాప్తంగా 22 రాష్టాల క్రీడకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అసలేంటీ కొలీజియం? కేంద్రానికి, న్యాయవ్యవస్థకు మధ్య ఘర్షణ ఎందుకు..?
    న్యాయమూర్తులను నియమిస్తున్న కొలీజియం వ్యవస్థ అన్నది రాజ్యాంగానికి అతీతంగా ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్​ రిజిజు అన్నారు. కొలీజియం వ్యవస్థే కారణంగానే దేశంలో కేసులు కొండల్లా పేరుకు పోయాయని ఆరోపించారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు మధ్య ఘర్షణ నెలకొంది. అసలు కొలీజియం అంటే ఏంటీ? ఎలా వచ్చిందంటే?. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఐర్లాండ్ ప్రధానిగా భారత సంతతి వ్యక్తి​.. అభినందించిన ప్రధాని మోదీ
    భారత సంతతికి చెందిన లియో వరాద్కర్​.. ఐర్లాండ్​ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఫిన్​గేల్ పార్టీకి చెందిన ఆయనకు రొటేషన్ పద్ధతిలో మరోసారి అవకాశం వచ్చింది. లియో వరాద్కర్​కు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పడగ విప్పుతున్న జపాన్‌.. అణ్వస్త్రాలను సమకూర్చుకొంటుంది అందుకేనా!
    అలుగుటయే ఎరుంగని అజాత శత్రువు అలిగిన నాడు.. అన్నట్లు.. యుద్ధం, పోరు అనే పదాల్నే తన నిఘంటువులో నిషేధించి, శాంతికాముక రాజ్యాంగాన్ని రాసుకున్న దేశం ఆయుధ వేట మొదలెడితే ఏమనాలి? ఆ పరిస్థితిని ఎలా అంచనా వేయాలి? ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన జపాన్‌ తాజా నిర్ణయాలు ఇప్పుడందరిలోనూ ఇవే ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నగదు బదిలీలో పొరపాటా? ఇలా చేస్తే సులువుగా వెనక్కి తెచ్చుకోవచ్చు!
    కొన్నిసార్లు పొరపాటున పేటీఎం, ఫోన్‌పే, గూగుల్​ పేలో ఒకరికి బదులు మరొకరికి డబ్బులు పంపి వాటిని తిరుగు తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడవలసి వచ్చేది. ప్రస్తుతం ఆర్​బీఐ తెచ్చిన కొత్త నింబంధనలు ద్వారా సులువుగా వాటిని వెనక్కి తెచ్చుకోవచ్చు. ఇటువంటి వాటికోసం అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించవచ్చని తెలిపింది. అది ఎలా అంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • IND vs BAN: చెలరేగిన బౌలర్లు.. తొలి టెస్టులో బంగ్లాపై భారత్‌ అద్భుత విజయం
    తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 513 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌ 324 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌ 188 పరుగుల తేడాతో గెలిచింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బ్లూ కలర్​ సారీలో సునయన ఎంత క్యూట్​గా ఉందో
    2005లో రిలీజ్​ అయిన కుమారి వర్సెస్ కుమారి అనే తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ సునయన. తన అందం, నవ్వుతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం విశాల్​కు జోడీ లాఠీ సినిమాలో నటిస్తోంది. తాజాగా బ్లూ కలర్​ సారీలో దిగిన ఫొటోలను ఇన్​స్టాగ్రామ్​ వేదికగా పంచుకుంది. ఇవి కాస్త సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details