ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 11 AM

..

ఏపీ ప్రధాన వార్తలు
AP TOP NEWS

By

Published : Dec 17, 2022, 10:59 AM IST

  • నాడు తండ్రి.. నేడు తనయుడు.. సహజ వనరులను అస్మదీయలకు అప్పగింత
    YERRAVARAM PUMPED STORAGE PROJECT: నాడు తండ్రి వైఎస్‌.. నేడు కొడుకు జగన్‌.. సహజ వనరులను అస్మదీయులకు అడ్డగోలుగా అప్పగించడంలో ఇద్దరి బాణీ ఒకటే. సొంత ప్రయోజనాల ముందు గిరిజనులు, వారి హక్కులు, రాజ్యాంగ నిబంధనలు బేఖాతరే. ఇక లబ్ధిదారులేమో..అప్పట్లో తండ్రి.. తనకు సన్నిహితుడైన పెన్నా సిమెంట్స్‌ యజమానికి విశాఖ ఏజెన్సీలోని విలువైన బాక్సైట్‌ ఖనిజ సంపదను కేటాయించేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో సీఎం మరోసారి మోసం చేస్తున్నారు: అఖిలపక్ష నేతలు
    CM is cheating once again in setting up the steel industry: కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై సీఎం జగన్ మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారని విపక్ష నాయకులు విమర్శించారు. మూడేళ్ల కిందట గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • "నా మరణదిన వేడుకలకు ప్రతి ఒక్కరు రండి".. వైరల్​ అవుతున్న మాజీ మంత్రి పాలేటి రామారావు ఆహ్వాన పత్రిక
    paleti ramarao invitation: ఏ మనిషైనా పుట్టడం, మరణించడం సహజం. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి.. ఉన్నంతవరకు ఆనందంగా జీవించాలని చాలా మంది పుట్టినరోజు, ఇతర వేడుకలను వైభవంగా జరుపుకుంటారు. కొద్దిమంది ముందు జాగ్రత్తగా చనిపోక ముందే సమాధులు తయారు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి భిన్నంగా ఆలోచించి..తన మరణదిన వేడుకలను జరుపుకోవాలని నిర్ణయించుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఉపాధ్యాయ బదిలీలకు ప్రభుత్వం ఆమోదం
    Government has approved the transfers of government teachers: రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయ బదిలీలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విజయవాడ సమగ్ర శిక్ష అభియాన్‌ కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో ఉపాధ్యాయ సంఘ నాయకులు సమావేశమయ్యారు. హేతుబద్దీకరణ, పాఠశాలల మ్యాపింగ్‌ కారణంగా నష్టపోతున్న ఉపాధ్యాయ సంఘాల నేతలు విన్నవించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బంగాళదుంపలు దొంగిలించిన పోలీసులు
    కూరగాయల దుకాణంలో బంగాళదుంపలు దొంగిలించారు ఇద్దరు కానిస్టేబుల్స్​. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ కుశీనగర్​లోని తుర్కపట్టి పరిధిలో డిసెంబర్​ 12 అర్ధరాత్రి జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అమెరికా టార్గెట్​గా ఉత్తర కొరియా కీలక పరీక్ష.. కిమ్​ పర్యవేక్షణలోనే..
    ఉత్తర కొరియా శక్తిమంతమైన సరికొత్త వ్యూహాత్మక ఆయుధ తయారీ దిశగా ముందడుగు వేసింది. అమెరికా భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని ఓ కీలక పరీక్షను నిర్వహించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'ప్రపంచంలోని అంతర్జాతీయ తయారీ సంస్థలను భారత్​కు రప్పించాలి'
    ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆర్థిక మాంద్యంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని బహుళజాతి సంస్థలు భారత్‌కు వచ్చేలా వ్యూహాలు సిద్ధం చేయాలని భారత పరిశ్రమ సంఘాలకు సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వర్డ్‌ క్రాష్‌ అవుతోందా?.. డోంట్​ వర్రీ ఇలా చేస్తే చాలు
    మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌లో ఏదో ముఖ్యమైన సమాచారాన్ని టైప్‌ చేస్తుంటాం. సేవ్‌ చేసే సమయంలో డాక్యుమెంట్‌ ఫ్రీజ్‌ అయితే? శ్రమంతా వృథా అవుతుంది. సత్వరం ముగించాల్సిన పనయితే ఇంకాస్త ఆందోళన పెరుగుతుంది. తరచూ ఇలాంటి సమస్య ఎదురవుతోందా? దీన్ని తప్పించుకునే మార్గమేది? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రెండో టెస్టుకు రోహిత్ రెడీ.. మరి తుది జట్టులో ఎవర్ని తప్పిస్తారో?
    Rohit Sharma Injury update : బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడిన రోహిత్‌ శర్మ.. డిసెంబరు 22 నుంచి బంగ్లాతో ప్రారంభంకానున్న రెండో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశాలున్నాయి. త్వరలోనే రోహిత్‌ బంగ్లాదేశ్‌ చేరుకొని జట్టుతో కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'అవతార్ 2' తొలి రోజు ఎంత వసూలు చేసిందంటే
    సినీ ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన భారీ విజువల్ వండర్​ 'అవతార్​ 2' రిలీజై పాజిటివ్​ టాక్​ను తెచ్చుకుంది. ఈ సినిమా తొలి రోజు ఎంత వసూలు చేసిందంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details