ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @11AM - ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

..

AP TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు

By

Published : Dec 16, 2022, 11:06 AM IST

  • మంత్రి కాకాణీ గారూ.. మీకు నైతికత లేదా​?
    ALLEGATIONS ON MINISTER KAKANI: ప్రజాప్రతినిధి అంటే బాధ్యతాయుతంగా ఉండాలి. పదవిలో ఉండేవారు పది మందికీ ఆదర్శంగా ఉండాలి. నైతిక విలువలు, నిజాయతీ, నిబద్ధత కలిగి ఉండాలి. అందులోనూ మంత్రి పదవిలో ఉండేవారికి నైతికత, ప్రజాస్వామ్యంపై గౌరవం రెండింతలు ఎక్కువగానే ఉండాలి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆ జిల్లాల్లో మద్యం విక్రయాలపై తక్కువ రెవెన్యూ : మంత్రి నారాయణ స్వామి
    EXCISE MINISTER NARAYANA SWAMY : రాష్ట్రంలోని పలు జిల్లాలో ఏప్రిల్​-నవంబర్​ మధ్య కాలంలో మద్యం విక్రయాల్లో తక్కువ రెవెన్యూ నమోదు చేసినట్లు అబ్కారీ శాఖ మంత్రి నారాయణ స్వామి తెలిపారు. మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపటంతో పాటు తయారీదారులకు ప్రత్నామ్నాయ ఉపాధి కల్పించేలా పరివర్తన పథకాన్ని అమలు చేయాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • డిప్యూటీ కలెక్టర్​గా ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతిసురేఖ..
    CM appointed Jyotisurekha as Deputy Collector: ప్రముఖ విలువిద్య క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖను డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పోర్ట్స్‌ కోటాలో ఆమెకు గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తామంటూ సీఎం ఇచ్చిన హామీ మేరకు జ్యోతిసురేఖను డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వచ్చే ఏడాది​ నుంచి అన్ని తరగతులకు సీబీఎస్‌ఈ పాఠ్యాంశాలే...
    Henceforth cbse syllabus for all classes: వచ్చే విద్యా సంవత్సరంలో అన్ని తరగతులకు సీబీఎస్‌ఈ సిలబస్‌కు అనుగుణంగా పుస్తకాలనే అందించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. సాంఘిక శాస్త్రంలో మాత్రమే రాష్ట్ర సిలబస్‌ ఉంటుంది. ఇప్పటి వరకు దేశ చరిత్ర మాత్రమే ఉంది ఇక నుంచి రాష్ట్ర సిలబస్‌ ఇవ్వనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'పదేళ్లు గడిచినా.. నాటి పరిస్థితులే నేటికీ'.. నిర్భయ తల్లిదండ్రుల ఆవేదన
    నిర్భయ ఘటన జరిగి పదేళ్లు గడిచినా.. ఇప్పటికీ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదని నిర్భయ తల్లిదండ్రులు అన్నారు. దేశంలో ఇప్పటికీ మహిళలకు భద్రత లేదని నిర్భయ తండ్రి బద్రీ నారాయణ అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'లాడెన్‌కు ఆశ్రయమిచ్చిన మీరా మాట్లాడేది!'.. ఐరాసలో పాక్‌కు జైశంకర్‌ దీటైన జవాబు
    అంతర్జాతీయ వేదికపై భారత్‌ను దోషిగా నిలబెట్టాలని పాకిస్థాన్‌ మరోసారి ప్రయత్నించింది. అయితే పాక్​కు భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ దీటైన సమాధానం ఇచ్చారు. దీంతో మరోసారి పాకిస్థాన్​కు భంగపాటు తప్పలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'వచ్చే ఏడాది భారత ఆర్థిక వ్యవస్థకు కష్టకాలమే'.. ఆర్​బీఐ మాజీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
    దేశ ఆర్థిక వ్యవస్థపై ఆర్​బీఐ మాజీ గవర్నర్ రఘురామ్‌ రాజన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది భారత్‌ ఆర్థిక వ్యవస్థకు కష్టకాలమేనని ఆయన అభిప్రాయపడ్డారు. కొవిడ్‌ పరిణామాల్లో తీవ్రంగా ఇబ్బందులు పడిన దిగువ మధ్య తరగతిని దృష్టిలో ఉంచుకుని విధానాలు రూపొందించాలని ప్రభుత్వానికి రాజన్​ సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కుల్‌దీప్‌ ఐదు వికెట్ల ప్రదర్శన.. కుప్పకూలిన బంగ్లా .. భారత్‌కు భారీ ఆధిక్యం
    టీమ్​ఇండియాతో జరుగతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 150 పరుగులకే ఆలౌట్​ అయింది. భారత స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సచిన్ అడ్వైస్​​తోనే అర్జున్ సెంచరీ.. అలా చేయమని చెప్పాడంటా..
    తన కొడుకు అర్జున్ తెందుల్కర్​ రంజీ ట్రోఫీలో తొలి సెంచరీ బాదడంపై స్పందించాడు దిగ్గజ క్రికెటర్​ సచిన్ తెందుల్కర్​. ఏం అన్నాడంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తల నుంచి కాలిగోరు వరకు అందంగా ఉండాలా.. అయితే 'ఇ' ఆయిల్ వాడేయండి!
    Vitamin e Oil Benefits : అందంగా ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అయితే అందాన్ని కాపాడుకోవడం కోసం పలు జాగ్రత్తలు తీసుకుంటారు. తల నుంచి కాలిగోరు వరకు సంరక్షణ కోసం విటమిన్ 'ఇ' ఆయిల్​ను వాడి మీ అందాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details