- గ్రీన్‌కో సంస్థ పరిహారానికి.. ప్రేతాత్మలు పుట్టుకొచ్చాయ్..
నంద్యాల జిల్లాలో ఓ ప్రాజెక్టు పరిహారాన్ని..ప్రేతాత్మలు మింగేశాయి. మృతి చెందినవారి పేర్లు రెవెన్యూ దస్త్రాల్లో నమోదు చేసి..చేర్పించారు. ఆ తర్వాత ఎంచక్కా వారసుల పేరుతో దర్జాగా పరిహారం బుక్కేశారు. విషయం బయటకు రావడంతో కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. ఐతే దందాలో కీలకమైన వారిని వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎంపీ కేశినేని నాని కుమార్తె వివాహానికి హాజరైన చంద్రబాబు దంపతులు
టీడీపీ ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత వివాహ మహోత్సవానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు దంపతులు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నూతన కార్యవర్గ ఎన్నిక ఎందుకు జరపడం లేదు.. బార్ అసోసియేషన్‌పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘంపై ఉన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. నూతన కార్యవర్గ ఎన్నికను ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రస్తుత కార్యవర్గాన్ని ప్రశ్నించింది. మెమో చూస్తుంటే ఎన్నికలు నిర్వహించేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు లేదని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మైనింగ్ లక్ష్యాలపై గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష
రాష్ట్రంలో ఆదాయ లక్ష్యానికి అనుగుణంగా మైనింగ్ రెవెన్యూను సాధించాలని గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు. ఏపీలో ఉన్న అపారమైన ఖనిజవనరుల్ని వెలికి తీసి పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తే పరిశ్రమలకు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.