- విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ మరోసారి సమావేశం.. ఎప్పుడంటే??
BIFURACTION MEETING : తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో మరోమారు భేటీ కానుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ.. ఏపీ, తెలంగాణ అధికారులకు సమాచారం పంపించి.. సమావేశానికి తప్పకుండా హాజరుకావాలని చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చంద్రబాబుకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారు: వర్ల రామయ్య
VARLA LETTER TO DGP ON CBN INCIDENT : తెదేపా అధినేత చంద్రబాబుకు సరైన భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. బాబు పర్యటనలో భద్రతా లోపాలకు కారణమైన డీఎస్పీ, సీఐ తదితరులను సస్పెండ్ చేసి సరైన సెక్షన్లతో కేసు నమోదు చేయాలని డీజీపీకి లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- Ippatam: ప్రభుత్వం ఇళ్లను కూల్చింది .. పవన్ రూ.1లక్ష ఆర్థిక సాయం చేస్తున్నారు...
Pawan Kalyan: గుంటూరు జిల్లా ఇప్పటంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆపన్నహస్తం అందించారు. ఇప్పటికే ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చి పవన్.. ఇల్లు కోల్పోయిన ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. ఆ మొత్తాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ త్వరలోనే అందజేయనున్నట్లు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటనలో తెలిపారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- "ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదులో అధికార పార్టీ అక్రమాలు"
Registration Of MLC voter : శాసనమండలి ఎన్నికల ఓటర్ల నమోదులో అధికార పార్టీ అక్రమాలు కొనసాగుతున్నాయని నెల్లూరు ప్రజా సంఘాల నేతలు మండిపడ్డారు. గడువుకు సమయం ముగిసిన తర్వాత కూడా వందల సంఖ్యలో అప్లికేషన్లు తీసుకొచ్చారుని ఆక్షేపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- లాడ్జ్‌లో యువతి, యువకుడి ఆత్మహత్య..
man and woman committed suicide in a lodge: తిరుపతి నగరంలోని ఓ యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. మృతులు హైదరాబాద్‍కు చెందిన కృష్ణారావు, తూర్పుగోదావరి చెందిన అనూషగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దేశవ్యాప్తంగా కనుల విందుగా కార్తీక దీపోత్సవం
త్రిపురాసుడిపై మహాశివుడి విజయానికి గుర్తుగా జరుపుకొనే పవిత్రమైన కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని దేశంలోని పలు దేవాలయాలను అంగరంగ వైభవంగా అలంకరించారు. దీపాలు వెలిగించి కార్తీక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ దేవ్ దీపావళిని పురస్కరించుకుని వేలాది మంది భక్తులు నదీతీరంలో కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇద్దరమ్మాయిల ప్రేమాయణం.. పెళ్లి కోసం పురుషుడిగా మారిన యువతి
ఓ యువతి లింగమార్పిడి చేసుకుని యువకుడిలా మారింది. అనంతరం పెద్దల అనుమతితో మరో యువతిని పెళ్లిచేసుకుంది. ఈ ఘటన రాజస్థాన్‌లోని భరత్‌పుర్ జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకున్నాం.. ఇకపై కూడా కొనసాగిస్తాం'.. రష్యా వ్యాపారి కీలక వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దానిపై ప్రముఖ రష్యన్ వ్యాపారవేత్త యెవ్జెనీ ప్రిగోజిన్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇన్‌స్టాలో వానిష్ మోడ్.. మెసేజ్‌లన్నీ మాయం! ఎలా ఎనేబుల్ చేయాలో తెలుసా?
Instagram Vanish Mode : ఆన్‌లైన్ చాటింగ్ చేసే వారి వ్యక్తిగత గోప్యత కోసం ప్రైవసీ ఫీచర్లు ఉపయోగించమని సోషల్ మీడియా సంస్థలు సూచిస్తున్నాయి. వీటిని ఆయా కంపెనీలు వేర్వేరు పేర్లతో యూజర్లకు పరిచయం చేశాయి. పిలిచే పేర్లే వేరయినా.. ఇవి చేసే పనిమాతరం యూజర్ల గోప్యతకు భంగం కలగకుండా చేయడమే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అనుష్క ఇన్ని సూపర్ హిట్ సినిమాలు రిజెక్ట్ చేసిందా
సూపర్ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన స్వీటీ తన అందంతో, అభినయంతో సౌత్ ఇండియానే కాదు దేశవ్యాప్తంగా విశేష అభిమానగణాన్ని సొంతం చేసుకుంది. అరుంధతి,భాగమతి లాంటి సినిమాలతో లేడీ ఓరియెంటడ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. అయితే కొద్ది కాలం నుంచి సినిమాల విషయంలో కాస్త జోరు తగ్గించిన ఈ భామ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఏపీ ప్రధాన వార్తలు