AP Students met Modi: రాష్ట్రంలోని కొంతమంది ఎస్సీ, ఎస్టీ పాఠశాల విద్యార్ధులు విజ్ఞాన యాత్రలో భాగంగా దిల్లీ వెళ్లారు. అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి మాట్లాడారని... ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున వెల్లడించారు. దిల్లీ వెళ్లిన విద్యార్ధులతో కొద్దిసేపు ముచ్చటించిన ప్రధాని మోదీ వారికి కొన్ని పుస్తకాలు కూడా బహుమతిగా ఇచ్చారని తెలిపారు. అంతే కాకుండా ప్రధాని మోదీని కలిసిన విద్యార్ధులు చాలా ఆనందాన్ని వ్యక్త పరిచారని తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసే పిల్లలకు రావడం చాలా అరుదు అని కాని ఇలాంటి అవకాశం రావడం నిజంగా ఆ విద్యార్ధులు చేసుకున్న అదృష్టం అని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ బ్యాంక్ సామాజిక బాధ్యతా నిధులతో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతో ఈ యాత్ర ఏర్పాటు చేసిందని తెలిపారు. కడప, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలోని ప్రతిభా వంతులైన 42 మంది బాల, బాలికలను ఎంపిక చేసి ఈ విజ్ఞాన యాత్రకు వెళ్లారని.. దిల్లీలోని పార్లమెంటు భవనంలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసి కొంచెంసేపు మాట్లాడారు అని తెలిపారు.
దిల్లీలో ప్రధాని మోదీతో కలిసి మాట్లాడిన ఏపీ విధ్యార్థులు.. బహుమతిగా ఏమిచ్చారంటే! - Swami Vivekananda Life stories
AP Students met Modi: రాష్ట్రంలోని కొంతమంది పాఠశాల విద్యార్థులు విజ్ఞాన యాత్రలో భాగంగా.. దిల్లీలో ప్రధాని మోదీతో కలిసి మాట్లాడారని.. మంత్రి మేరుగ నాగార్జున వెల్లడించారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించిన ప్రధాని వారికి పుస్తకాలు బహూకరించారని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ బ్యాంక్ సామాజిక బాధ్యతా నిధులతో.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఈ యాత్ర ఏర్పాటు చేసిందన్నారు.
స్వాతంత్ర సమర యోధుల జీవిత చరిత్రలకు సంబంధించిన కొన్ని పుస్తకాలు, స్వామి వివేకానంద వంటి గోప్ప చరిత్ర కలిగిన మహనీయుల జీవిత గాథలు చదివి వాటి ద్వారా.. స్ఫూర్తిని పొందాలని ప్రధాని మోదీ విద్యార్థులకు ఉద్భోధించారని వివరించారు. జీవితంలో ఏన్నో పరీక్షలు రాయ వలసి ఉంటుంది మీరు దేనికి భయపడకూడదు అని ముఖ్యంగా ఈ పరీక్షల విషయంలో మీపు భయాలను విడనాడాలని.. మీపు చదివే సమయంలో కష్టపడి కాకుండా ఇష్టపడి చదవితే మీకు బాగా అర్థం అవుతుంది.. దాని ద్వారా.. తమ భవిష్యత్తును ఉజ్వలంగా మలచు కోవాలని.. భావి భారత పౌరులుగా మీరు మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని కూడా విద్యార్థులకు హితవు చెప్పారని అన్నారు. మీరు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాక.. నైతిక విలువలు పాటిస్తూ నీతి నిజాయితీలతో సంపాదించాలని.. అలా సంపాదించిన ధనాన్ని వృధా చేయకుండా జాగ్రత్తగా పొదుపు చేయాలని కోరడంతో పాటుగా. ప్రతి ఒక్కరు కూడా జన్ ధన్ ఖాతాలను ప్రారంభించి.. వాటి ద్వారా మీరు సంపాదించిన దానిని పొదుపు చేయడం ప్రారంభించాలని ప్రధాని మోదీ సూచించినట్లు మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. పరీక్షలలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ఎగ్జామ్ వారియర్స్ పుస్తకాలను కూడా ప్రధాని బహూమతికా ఇచ్చినట్లు వివరించారు.
ఇవీ చదవండి: