విశాఖ సింహాచలం ఆలయానికి శ్రీకృష్ణ దేవరాయలు సమర్పించిన ఆభరణాలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఓ భక్తుడు సహ చట్టం ద్వారా కోరగా సరైన సమాధానం ఇవ్వలేదనే ఫిర్యాదు మేరకు సింహా చలం దేవస్థాన అధికారులకు ఏపీ సహ చట్టం కమిషనర్ నోటీసు జారీ చేశారు. సింహాద్రి అప్పన్న స్వామికి శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిన ఆభరణాలు, కానుక లను ఏ విధంగా పరిరక్షిస్తున్నారని, వాటిని ప్రదర్శించాలని 2012 మార్చి 14న ఏలూరుకు చెందిన భక్తుడు బీకేఎస్ఆర్. అయ్యంగార్ సహ చట్టం ద్వారా దేవస్థానానికి దరఖాస్తు చేశారు.
సింహాచల ఆలయ అధికారులకు ఏపీ సహ చట్టం కమిషనర్ నోటీసులు - విశాఖ సింహచలం ఆలయానికి సమాచార హక్కు చట్టం నోటీసులు
విశాఖలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచల ఆలయానికి ఏపీ సహ చట్టం కమిషనర్ నోటీసులు జారీ చేశారు. కరోనా ఉద్ధృతి కారణంగా ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
సరైన సమాధానం రాకపోవడంతో 2012 మే 11న మరోసారి మొదటి అప్పిలేటు అధికారికి దరఖాస్తు చేయగా వాటిని జిల్లా ట్రెజరీలో భద్ర పరిచామని సమాధానమిచ్చారు. ఆ జవాబు సంతృప్తికరంగా లేదంటూ ఉమ్మడి రాష్ట్ర సమా చార కమిషనర్‌కు 2012 జులై 27న అయ్యంగార్ రెండోసారి అప్పీలు చేశారు. దానిపై స్పందించిన ఏపీ సహ చట్టం కమిషనర్ ఈ నోటీసు జారీ చేశారు. కొవిడ్-19 నేపథ్యంలో జులై 2న ఆన్లైన్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే విచారణకు తగిన సమాచారంతో హాజరు కావాలని ఆదేశించారు.
ఇదీ చదవండీ..AP Cabinet: రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం