ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి' - వైకాపా మేనిఫెస్టోపై ఏపీ ఎన్జీవో అసోసియేషన్ కామెంట్స్

వైకాపా ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో అసోసియేషన్ విశాఖలో ఆందోళన చేపట్టింది. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు.

'మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి'
'మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి'

By

Published : Sep 29, 2020, 3:29 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఇచ్చిన పిలుపు మేరకు విశాఖలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నిరసన వ్యక్తం చేసింది. మధ్యాహ్న భోజన సమయంలో ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని సీపీఎస్ విధానాన్ని రద్దు పరిచి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని నియామకాలపై నిషేధాలను తొలగించాలని అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణను నిలిపివేయాలని కార్మిక చట్ట సవరణ లను రద్దు చేయాలని పీఆర్సీని వెంటనే అమలు చేయాలని కోరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details