ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీ ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల - 6వ తరగతికి మోడల్ స్కూలు నోటిఫికేషన్స్

ఏపీ ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రవేశాలకు సంబంధించిన వివరాల కోసం.. ఆయా మండల, జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

school
ఏపీ మోడల్ పాఠశాల

By

Published : Apr 18, 2021, 3:09 PM IST

ఏపీ ఆదర్శ పాఠశాలల్లో.. ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆదర్శ పాఠశాలలో (మోడల్ స్కూల్స్) 2021-22 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా 164 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. విశాఖ జిల్లాలో చీడికాడ, నర్సీపట్నం, రావికమతం, కశింకోట, మునగపాక మండలాల్లో.. ఐదు పాఠశాలలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆయా పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది. ఆన్ లైన్​లో దరఖాస్తు చేసుకోవాలని సంయుక్త సంచాలకులు మధుసూదనరావు సూచించారు. ఆయా పాఠశాలల్లో ఆరు నుంచి ఇంటర్ వరకు ఉచిత బోధన ఉంటుందని తెలిపారు.

ప్రవేశ అర్హతలు.. దరఖాస్తు విధానం

  • ఓసీ, బీసీ విద్యార్థులు 01-09-2009 నుంచి 31-08-2011 మధ్య జన్మించి ఉండాలి.
  • ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01-09-2007 నుంచి 01-08-2011 మధ్య జన్మించి ఉండాలి.
  • ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో మూడేళ్లు చదవాలి. ప్రస్తుతం 2020-21 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదువుతున్నవారు అర్హులు.
  • దరఖాస్తులు http://www.cse.ap.gov.in/apms.ap.gov.in వెబ్సైట్ లో.. ఏప్రిల్ 16 నుంచి మే 15 తేదీలోపు దరఖాస్తు రుసుము.. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ రూ.50లు చెల్లించి, దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఆరో తరగతిలో ప్రవేశాలు లాటరీ ద్వారా.. రిజర్వేషన్ రూల్స్ ప్రకారం సీట్లు కేటాయింపు ఉంటుంది.
  • మరింత సమాచారం కోసం ఆయా మండల, జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో సంప్రదించవచ్చుని.. చీడికాడ ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వెంకటలక్ష్మి తెలిపారు.

ఇదీ చదవండి:

ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించండి: వెంకట్రామిరెడ్డి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details