జీతాలు చెల్లించండి మహా ప్రభో అంటూ విశాఖలోని ఘోషా ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. ఆస్పత్రి ఎదుట ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ధర్నా చేపట్టింది. ఐదు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో తమ పరిస్థితి దయానీయంగా మారిందని యూనియన్ ప్రధాన కార్యదర్శి జెడీ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
కొవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలకు తెగించి పని చేస్తున్న తమకు జీతాలు కూడా ఇవ్వకపోవడం సమంజసం కాదని వాపోయారు. వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.