ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆరోగ్య రథం వైద్య సేవలను నిలిపివేయొద్దు..! - ap jenco health bus at seleru in visakhapatnam news

ఏపీ జెన్‌కో గిరి గ్రామాలకు వైద్యసేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన ఆరోగ్యరథం సేవలను నిలిపివేయడానికి యోచిస్తున్నట్లు ... వచ్చిన సమాచారంతో గిరి గ్రామాల్లో ఆందోళన నెలకొంది.

ఆరోగ్యరథం వద్ద పరీక్షలు చేయిమచుకుంటున్న చిన్నారులు

By

Published : Nov 15, 2019, 10:43 AM IST

ఆరోగ్యరథం సేవలు నిలిపి వేయొద్దని ప్రజల విజ్ఞప్తి
సుమారు 15 నెలలు క్రితం ప్రయోగాత్మకంగా ఏపీ జెన్‌కో రాష్ట్రంలో రెండు ఆరోగ్యరథాలను ఏర్పాటు చేయగా.... ఒకటి సీలేరు కాంప్లెక్స్‌కు కేటాయించారు. అత్యాధునిక సాంకేతికతో కూడిన వైద్య సేవలను ఈ రథంలో అందుబాటులో ఉంచారు. మలేరియా, టైఫాయిడ్‌, డెంగీ జ్వరాలతోపాటు సుమారు 200 పరీక్షలు ఉచితంగా చేసి.. మందులు కూడా అందిస్తారు. సుమారు 40 గిరి గ్రామాలకు నెలకొకసారి ఈ సేవలు అందించే విధంగా అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈ సేవలను నిలిపి వేయడానికి ఏపీ జెన్‌కో సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం రావడం వల్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ జెన్‌కో అధికారులు సామాజిక బాధ్యతతో ఏర్పాటు చేసిన ఆరోగ్యరథం సేవలను కొనసాగించాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details