ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం నుంచి ప్రతిపాదనలు రాలేదు'

స్టీల్ ప్లాంట్​లో పెట్టుబడుల ఉపసంహరణపై రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కేంద్రానికి ప్రతిపాదనలేవి పంపలేదని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం నుంచి తమకెలాంటి ప్రతిపాదనలు రాలేదన్నారు.

minister goutham reddy comments on vishaka steel plant privatization
minister goutham reddy comments on vishaka steel plant privatization

By

Published : Mar 23, 2021, 3:11 PM IST

విశాఖ స్టీల్​ ప్లాంట్​ ప్రైవేటీకరణపై మాట్లాడుతున్న మంత్రి గౌతమ్ రెడ్డి

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణపై మంత్రి గౌతంరెడ్డి స్పందించారు. పెట్టుబడుల ఉపసంహరణపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పంపలేదని గౌతంరెడ్డి స్పష్టం చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం నుంచి తమకు ప్రతిపాదనలు రాలేదన్నారు. కేంద్రం ప్రస్తావిస్తే రాష్ట్రం తరఫున కొనే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.

విశాఖ గంగవరం పోర్టు అదానీ గ్రూప్‌నకు వెళ్లడం మంచిదేనని మంత్రి గౌతంరెడ్డి అభిప్రాయపడ్డారు. పెద్ద పారిశ్రామికవేత్త చేతికి వెళ్తే పెట్టుబడులు పెరిగే అవకాశముంటుందన్నారు. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా అలాగే కొనసాగుతుందన్నారు. గంగవరం ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో మార్పు ఉండదని మంత్రి గౌతంరెడ్డి వెల్లడించారు.

ఇదీ చదవండి: కొత్త ఎస్‌ఈసీ కోసం గవర్నర్‌కు మూడు పేర్లు సిఫారసు చేసిన ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details