ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ ఎన్​కౌంటర్​పై అవసరమైతే ఎన్ఐఏతో విచారణ: హైకోర్టు - విశాఖ ఎన్​కౌంటర్ తాజా వార్తలు

2012లో జరిగిన విశాఖ ఎన్​కౌంటర్, పిటిషనర్ల విశ్వసనీయతపై అవసరమైతే ఎన్ఐఏతో విచారణ చేయిస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది. విశాఖ సివిల్ లిబర్టీస్ యూనియన్ అధ్యక్షులు అక్బర్ వేసిన పిటిషన్​పై సోమవారం విచారించిన న్యాయస్థానం...తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.

విశాఖ ఎన్​కౌంటర్​పై అవసరమైతే ఎన్ఐఏతో విచారణ: హైకోర్టు
విశాఖ ఎన్​కౌంటర్​పై అవసరమైతే ఎన్ఐఏతో విచారణ: హైకోర్టు

By

Published : Sep 14, 2020, 5:07 PM IST

బూటకపు ఎన్​కౌంటర్​పై విశాఖ సివిల్ లిబర్టీస్ యూనియన్ అధ్యక్షులు అక్బర్ వేసిన పిటిషన్​పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. మావోయిస్టుల కూంబింగ్ పేరుతో ఇద్దరు అమాయక గిరిజనులను 2012లో పోలీసులు కాల్చిచంపారని, బాధ్యులైన వారిపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని కోరుతూ అదే ఏడాది వేసిన పిటిషన్​ను మరోసారి హైకోర్టు విచారించింది.

విశాఖ ఎన్​కౌంటర్, పిటిషనర్ల విశ్వసనీయతపై అవసరమైతే ఎన్ఐఏతో విచారణ చేయిస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది. పోలీసులను ఇబ్బంది పెట్టేందుకు పిటిషన్ దాఖలు చేశారా? లేక నిజంగా బూటకపు ఎన్​కౌంటర్ అని వేశారా అనే అంశంపై విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details