పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ తెదేపా నేత అయ్యన్నపాత్రుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం.. అయ్యన్నపై తదుపరి చర్యలు నిలిపివేయాలని పోలీసులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
కేసు నేపథ్యం ఏంటంటే..
ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో పాల్గొన్న అయ్యన్నపాత్రుడు.. ముఖ్యమంత్రి జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైకాపా నాయకుడు రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు నల్లజెర్ల పోలీసులు అయ్యన్నపాత్రుడిపై 153ఎ, 505(2), 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు బుధవారం విశాఖ జిల్లా నర్సీపట్నంలోని ఆయన ఇంటికి వెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవటంతో ఇంటికి నోటీసులు అంటించి అక్కడి నుంచి వెనుదిరిగారు.
ఇదీ చదవండి
Police Notice: అయ్యన్న ఇంటికి పోలీసు నోటీసులు.. ఎందుకంటే ?