విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిని ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పరిశీలించారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉందని వైద్యాధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా...సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం,అనకాపల్లిలోని మెడికల్ కళాశాల నిర్మాణం కోసం కోడూరు, కొత్త తలారి వాని పాలెంలో అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. అలాగే...ఈ ఏడాది ఆగష్టులో నిర్మాణ పనుల కోసం టెండర్లు పిలుస్తారని పేర్కొన్నారు. అదే విధంగా... రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజక వర్గానికి ఒక మెడికల్ కళాశాలని నిర్మించాలనే ఆశయంతో, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారని తెలిపారు. దీని ప్రకారం,త్వరలోనే అనకాపల్లి మెడికల్ కళాశాల రానుందని వెల్లడించారు.
'నియోజక వర్గానికో వైద్య కళాశాల' - ఈటీవీ భారత్ తెలుగు తాజా వార్తలు
విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆసుపత్రిని ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పరిశీలించారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉందని వైద్యాధికారులు... మంత్రి దృష్టికి తీసుకురావడంతో, ఈ మేరకు సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం అనకాపల్లి మెడికల్ కాలేజీ నిర్మాణానికి సంబంధించిన పనులను పరిశీలించారు.
వైద్యారోగ్యశాఖా మంత్రి ఆళ్లనాని విశాఖ ఎన్టీఆర్ ఆసుపత్రి పరిశీలన