ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేంద్రం సూచనలతో వ్యాక్సిన్ పంపిణీపై అధికారుల కసరత్తు!

కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీపై కేంద్ర ఇచ్చిన సూచనలతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైయింది. జిల్లాకు సంబంధించి తొలి విడతలో 65 వేల మందికి సరిపడా వ్యాక్సిన్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ మేరకు వ్యాక్సిన్ స్టోరేజీ కేంద్రాలుగా కొన్ని ప్రాంతాలను ఎంచుకోవాలని అధికారులు నిర్ణయించారు.

COVID
COVID

By

Published : Nov 30, 2020, 5:02 PM IST

కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సూచనలతో వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తం అవుతున్నారు. అందుకు తగ్గటుగా స్టోరేజ్ కేంద్రాలను సిద్ధం చేసే పనులను ప్రారంభించారు. విశాఖ జిల్లాకు సంబంధించి తొలి విడతలో సుమారు 65వేల మందికి సరిపడా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రాలుగా జిల్లా ఇమ్యూనైజేషన్ కార్యాలయం, ప్రభుత్వ మానసిక వైద్యశాల, సెంట్రల్ డ్రగ్ స్టోర్ లోని కొంత ప్రాంతాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించారు.

వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే మొదట వైరస్ పై పోరులో ముందు వరుసలో ఉన్న వైద్య సిబ్బందికి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు సిబ్బంది వివరాలను సిద్ధం చేయాలని సూచించింది . ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాలోని 237 ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న 22,900మంది, 1182 ప్రైవేటు ఆసుపత్రుల క్లినిక్​ల్లో పనిచేస్తున్న 36వేల 756 మంది వివరాలను అధికారులు సేకరించి సిద్ధంగా ఉంచారు. మరో ఐదువేల మంది వివరాలు సేకరించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details