ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్​ను కలిసిన చెస్ క్రీడాకారిణి మీనాక్షి.. నగదు ప్రోత్సాహాన్ని ప్రకటించిన సీఎం - Rs 1 cr to chess prodigy Meenakshi

Meenakshi met CM Jagan: విశాఖకు చెందిన చదరంగ క్రీడాకారిణి కోలగట్ల అలన మీనాక్షి సీఎం జగన్‌ను కలిశారు. మీనాక్షి ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా... ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌ 2023 పురస్కారాన్ని అందుకున్నారు. పలు జాతీయ, అంతర్జాతీయ రికార్డులు నెలకొల్పిన మీనాక్షిని సీఎం ప్రత్యేకంగా అభినందించారు. మీనాక్షికి అవసరమైన విధంగా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మీనాక్షికి ప్రోత్సాహ నగదు, ఇంటి నిర్మాణం కోసం స్థలాన్ని మంజూరు చేశారు.

Meenakshi
Meenakshi

By

Published : Feb 6, 2023, 9:07 PM IST

corpus fund Rs 1 cr to chess prodigy Meenakshi: విశాఖపట్నానికి చెందిన చదరంగ క్రీడాకారిణి చిన్నారి కోలగట్ల అలన మీనాక్షి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశారు. ఇటీవల ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌ 2023 పురస్కారాన్ని రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకోవడం సహా ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో రికార్డులు నెలకొల్పిన మీనాక్షి ని సీఎం ప్రత్యేకంగా అభినందించారు. అంతర్జాతీయ స్ధాయిలో ఆంధ్రప్రదేశ్‌ పేరు ప్రఖ్యాతలు నిలబెట్టేలా చదరంగంలో మరింతగా రాణించాలని సీఎం ఆకాంక్షించారు. మీనాక్షికి అవసరమైన విధంగా పూర్తిస్ధాయిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

మీనాక్షికి విశాఖపట్నంలో వెయ్యి చదరపు గజాల ఇంటిస్ధలం సహా , ఆమె చెస్‌లో కెరీర్‌ను కొనసాగించేందుకు కార్పస్‌గా రూ. 1 కోటి నిధిని సీఎం ప్రకటించారు. జాతీయ, అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లలో పలు పతకాలు సాధించిన విషయాన్ని మీనాక్షి తల్లిదండ్రులు డాక్టర్‌ అపర్ణ, మధు సీఎంతో పంచుకున్నారు. మీనాక్షి ప్రతిభను ప్రసంసించిన సీఎం జగన్ వివిధ క్రీడా రంగాల్లో ప్రతిభ కనపరిచి ఆంధ్రప్రదేశ్‌ పేరు ప్రఖ్యాతలు అంతర్జాతీయ వేదికలపై చాటుతున్న క్రీడాకారులకు తమ ప్రభుత్వం పూర్తి అండదండలు అందిస్తుందని హామీ ఇచ్చారు.

మీనాక్షి విజయాలు ఇవీ: చిన్నప్పటి నుంచి మేథోపరమైన ఆటల్లో మీనాక్షికి ఉన్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు అందులో శిక్షణ ఇప్పించడం మొదలుపెట్టారు. చదువులో వెనకబడకుండా జాగ్రత్త తీసుకుంటూనే... చదరంగంలోనూ వివిధ టోర్నీల్లో పాల్గొంది మీనాక్షి. ఆ కృషి ఫలితమే.. జాతీయస్థాయిలో మూడుసార్లు పదేళ్ల లోపు బాలికల విభాగంలో పతకాలు వరించాయి. ఉమెన్‌ క్యాండిడేట్‌ మాస్టర్‌ టైటిల్‌ సాధించడంతో.. మీనాక్షి, ఫిడే ప్రమాణాల ప్రకారం అండర్-10లో ప్రపంచంలోనే రెండో ర్యాంకుకి ఎగబాకింది.

2018లో ఆసియా స్కూల్స్ అండర్-7 బాలికల విభాగంలో.. మీనాక్షి బంగారు పతకం సాధించింది. 2019లో ఆసియా యూత్ అండర్-8లో ర్యాపిడ్ గోల్డ్, వెస్ట్రన్ ఏషియన్ అండర్-8లో ర్యాపిడ్ గోల్డ్, బ్లిట్జ్ గోల్డ్, క్లాసిక్ బ్రాంజ్ పతకాలను సాధించింది. రాష్ట్రానికి సంబంధించిన టోర్నీల్లో అండర్-7 విభాగంలో ఛాంఫియన్ షిప్ టైటిల్, అండర్-9 కేటగిరిలో వెండి పతకం సాధించింది. 2020లో అండర్-9 బాలికల విభాగంలో ఛాంపియన్ కాగా.. 2021లో అండర్-12 కేటగిరిలో వెండి పతకం, అండర్-10 విభాగంలో ఛాంపియన్‌గా నిలిచింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details