ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పరిస్థితులు బాగున్నాయ్​.. విశాఖకు భారీగా పెట్టుబడులు వస్తాయి' - latest news for vizag executive center said by it minister

విశాఖను కార్య నిర్వాహక కేంద్రంగా చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి తెలిపారు. విశాఖకు పెట్టుబడులు తరలివస్తాయని.. హైదరాబాద్​లో జరిగే భారత్-  అమెరికా రక్షణ రంగ సంబంధాల సదస్సులో వెల్లడించారు.

ap government make Vizag an executive center said by ap it minister mekapati Gautam Reddy in hyderbad defence conference
భారత్-  అమెరికా రక్షణ రంగ సంబంధాల సదస్సులో మాట్లాడుతున్న ఏపీ ఐటీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి

By

Published : Dec 19, 2019, 4:56 PM IST

భారత్​ - అమెరికా రక్షణ రంగ సంబంధాల సదస్సులో పాల్గొన్న మంత్రి మేకపాటి

రానున్న రోజుల్లో విశాఖలో పెట్టుబడులకు మరింత అనుకూలంగా ఉంటుందని రాష్ట్ర ఐటీ మంత్రి మేకపాటి గౌతం​రెడ్డి అన్నారు. హైదరాబాద్​ తాజ్​ కృష్ణా హోటల్​లో జరిగిన భారత్​ - అమెరికా రక్షణ రంగ సంబంధాల సదస్సులో పాల్గొన్న ఆయన.. విశాఖను కార్య నిర్వాహక కేంద్రంగా చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపారు. ఈ సదస్సులో రక్షణ రంగానికి సంబంధించిన పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఏపీకి 900 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉండటం... రక్షణ రంగ పెట్టుబడులకు కలిసొచ్చే అంశంమని మంత్రి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో హైదరాబాద్ తర్వాత పెట్టుబడులు పెట్టటానికి విశాఖను ఎంచుకునే వారని.. కానీ గత ఐదేళ్లలో నిర్లక్ష్యానికి గురైందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో విశాఖకు భారీగా పెట్టుబడులు తరలివస్తాయని స్పష్టం చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details