విశాఖ భూ అక్రమాలపై విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయకుమార్ సారథ్యంలో.... రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి వై.వి.అనురాధ, జిల్లా విశ్రాంత న్యాయమూర్తి టి.భాస్కరరావులను సభ్యులుగా నియమించింది. అవసరమనుకుంటే సిట్ ఎవరినైనా కోఆప్ట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ దర్యాప్తు బృందం పదవీ కాలాన్ని 3 నెలలుగా నిర్ణయించింది. ప్రభుత్వ భూముల రికార్డుల తారుమారు, వెబ్‌ల్యాండ్‌లో మార్పులు, మాజీ సైనికులు, రాజకీయ బాధితులు.... భూములు అమ్ముకునేందుకు నిరభ్యంతర పత్రాల జారీ అంశాలను సిట్ పరిశీలిస్తుంది. ప్రభుత్వ భూముల కబ్జా, నిర్దేశించిన విధానం పాటించకుండా.... వ్యక్తులు, సంస్థలకు భూమి దఖలుపర్చిన కేసులను పరిశీలించనుంది. భూరికార్డులు తారుమారు చేసిన అధికార, అనధికార వ్యక్తులతో పాటు లబ్ధి పొందిన వారిని గుర్తించనుంది. భూ అక్రమాలపై పౌరసమాజం నుంచి వచ్చే ఫిర్యాదులను సిట్ స్వీకరించనుంది. దర్యాప్తులో భాగంగా ఎవరైనా వ్యక్తిని లేదా అధికారిని విచారణ చేసే అధికారాన్ని ప్రభుత్వం సిట్‌కు కట్టబెట్టింది.
విశాఖ భూ కుంభకోణంపై సిట్...ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
విశాఖ భూకుంభకోణంపై మరోసారి సిట్ ఏర్పాటైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ సహా పరిసర మండలాల్లో భూ ఆక్రమణలు, ప్రభుత్వ స్థలాల అన్యాక్రాంతం అంశాలను పరిశీలించాలని ప్రభుత్వం నిర్దేశించింది.
ap-government-appoints-sit-on-vsp-lands
తెలుగుదేశం హయాంలోనే ఇలానే...
విశాఖ భూక్రమాలపై గత ప్రభుత్వ హయాంలోనూ సిట్ ఏర్పాటైంది. అప్పట్లో సుదీర్ఘ విచారణ చేసిన దర్యాప్తు బృందం.... వేల పేజీల డాక్యుమెంట్లను పరిశీలించింది. వందల మందిని ప్రశ్నించింది. కొందరు అధికారులపై కేసులు నమోదు చేసి, అరెస్టులూ చేసింది. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించింది. అయితే అప్పటి సిట్ గురించి ప్రస్తుత ఉత్తర్వుల్లో ఎలాంటి ప్రస్తావన లేదు.
ఇదీ చూడండి: సింహాచలం భూసమస్యపై శారదా పీఠాధిపతితో మంత్రుల భేటి
Last Updated : Oct 18, 2019, 5:43 AM IST