ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్యాస్ లీకేజీ ఘటన బాధితులకు రూ.30 కోట్లు విడుదల - compensation to vishaka gas lekage victims

విశాఖ దుర్ఘటనలో బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. సీఎం జగన్​ హామీ మేరకు రూ.30 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం... వీటిని వెంటనే బాధితులకు చెల్లించాలని విశాఖ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చింది.

vishaka gas leakage victims as compensation
vishaka gas leakage victims as compensation

By

Published : May 8, 2020, 6:09 PM IST

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో బాధితులకు పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ.30 కోట్లు విడుదల చేసింది. సీఎం జగన్ హామీ మేరకు మృతుల కుటుంబాలకు రూ.కోటి, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షలు, 2 నుంచి మూడ్రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందాల్సిన వారికి రూ.లక్ష పరిహారం అందించనుంది. అలాగే ప్రాథమిక స్థాయి చికిత్స పొందిన వారికి రూ.25 వేలు, ప్రభావిత గ్రామాల్లోని వారికి రూ.10 వేల చొప్పున పరిహారం ఇవ్వనుంది. తక్షణమే ఈ పరిహారాన్ని చెల్లించాలని విశాఖ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చింది.

ABOUT THE AUTHOR

...view details