వాయుగుండంగా మారనున్న అల్పపీడనం
ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరో 24 గంటల్లో వాయుగుండంగా మారనుంది. అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర తీరంలో ఆకాశం మేఘావృతమైంది. ఈ ప్రభావంతో పలుచోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.
వాయుగుండంగా మారనున్న అల్పపీడనం
ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. బంగాల్, ఒడిశా తీరంపై కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర తీరంలో ఆకాశం మేఘావృతమైంది. ఇవాళ రాష్ట్రంలో చాలాచోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది. మరో 24 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా బలపడనుంది.