ETV Bharat / state
వైభవంగా సింహాద్రినాధుని కల్యాణోత్సవం - simhadri
విశాఖ సింహాచలం సింహగిరిపై... సింహాద్రి నాధుని కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణం సందర్భంగా గాలి గోపురాన్ని విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు.
సింహాద్రి నాధుని కల్యాణం
By
Published : Apr 16, 2019, 11:36 PM IST
| Updated : Apr 16, 2019, 11:58 PM IST
విశాఖ సింహగిరిపై... సింహాద్రి నాధుని కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా ఎదురు సన్నాహ ఉత్సవం వైభవంగా నిర్వహించి, అర్చకులు అమ్మవారి విశిష్టతను.. స్వామి వారికి తెలియజేశారు. దీంతో స్వామివారు పెళ్లికి అంగీకరించడంతో అర్చకులు పూలమాలతో నృత్యం చేస్తూ స్వామిని కీర్తించారు. అనంతరం స్వామివారికి గంధం పూసి పెళ్ళికొడుకుగా తయారు చేశారు. కల్యాణం సందర్భంగా గాలి గోపురాన్ని విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. గిరిపై కల్యాణోత్సవాల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. కల్యాణం వీక్షించేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. Last Updated : Apr 16, 2019, 11:58 PM IST