ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భద్రతా దళాలపై మావోలు చేసిన దాడిని నిరసిస్తూ ఆందోళనలు

ఛత్తీస్‌గఢ్‌ ఘటనతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజాపూర్‌ - సుకుమా జిల్లాల సరిహద్దుల్లో శనివారం సాయంత్రం జరిగిన ఘటనలో 22 మంది జవాన్లు మృత్యువాత పడ్డారు. జవాన్లపై దాడిని నిరసనగా అఖిల భారత్ విద్యార్థి పరిషత్ సభ్యులు ఆందోళన చేపట్టారు.

By

Published : Apr 5, 2021, 10:16 AM IST

Maoist attack
Maoist attack

ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలపై మావోలు చేసిన దాడిని అఖిల భారత్ విద్యార్థి పరిషత్ ఖండించింది. విశాఖ జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద నక్సల్స్ దిష్టి బొమ్మను దగ్దం చేసి నిరసన తెలిపారు. దేశం అభివృద్ధి పధంలో నడుస్తుంటే , హింసాత్మక మార్గంలో నడిచే నక్సల్ విధానం రూపుమాపాలని నినాదాలు చేశారు. మరణించిన జవానుల కుటుంబాలకు ప్రగాడ సానుభతి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details