కరోనా సహాయక చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కార్పెంటర్ల సంఘం ఆధ్వర్యంలో విశాఖలో ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. వలస కూలీలకు ఆహారం అందజేశారు. విశాఖ నుంచి ప్రత్యేక బస్సులు, లారీలు, టాక్సీలు, ఆటోలలో స్వస్థలాలకు బయలుదేరుతున్న వలస కూలీలకు జాతీయ రహదారిపై.. కార్పెంటర్ల సంఘం ప్రతినిధులు భోజనం పంచారు. పెరుగన్నం, అరటి పళ్ళు, వాటర్ ప్యాకెట్లు సుమారు 500 మందికి అందించారు.
వలస కూలీలకు ఆహారం పంపిణీ చేసిన కార్పెంటర్ల సంఘం - విశాఖలో వలస కూలీలకు ఆహారం పంచిన కార్పెంటర్ల సంఘం వార్తలు
లాక్ డౌన్ వేళ పేదలను, వలస కూలీలను ఆదుకునేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు. తమకు తోచిన విధంగా సాయపడుతున్నారు. విశాఖలో ఏపీ కార్పెంటర్ల సంఘం ఆధ్వర్యంలో వలస కూలీలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.
వలస కూలీలకు ఆహారం పంపిణీ చేసిన కార్పెంటర్ల సంఘం